ఆ యాప్స్ ని ప్రమోట్ చేసే సెలబ్రిటీలకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా...?
సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ సినిమాలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. సినిమాతో వచ్చే క్రేజ్ ని వాడుకొని రెండు చేతులా అంతో ఇంతో వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్లడంతో పాటు కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ కి కూడా అటెండ్ అవుతుంటారు. అంతేకాకుండా కొన్ని ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడానికి యాడ్స్ లలో నటిస్తుంటారు మన సినీ సెలబ్రిటీలు. 'ఆ కంపెనీకి చెందిన ఉత్పత్తులు బాగున్నాయి.. నేను కూడా అదే వాడతాను.. మీరు కూడా వాడి చుడండి' అంటూ సెలబ్రిటీలు భారీ మొత్తంలో కొల్లగొట్టేస్తున్నారు. గతంలో ప్రముఖ కంపెనీ ప్రొడక్స్ గురించి.. ఇతర యాప్స్ గురించి ప్రచారం చేయాలంటే సెలబ్రిటీలు గంటల కొద్ది సమయాన్ని వెచ్చించేవారు. కానీ ఈ డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్ తో యాడ్స్ ను ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంతో భారీగానే సంపాదిస్తున్నారనుకోండి. అయితే కొన్ని సందర్భాల్లో వీరు ఇచ్చే యాడ్స్ వల్ల కొందరి జీవితాలు ఎఫెక్ట్ అవుతుంటాయి కూడా.
మన సౌత్ ఇండియన్ సెలబ్రెటీలు కొందరు ఆన్లైన్ జూదాలను ప్రమోట్ చేసే యాప్స్ కి అడ్వర్టైజ్ మెంట్స్ ఇస్తున్నారు. ''ఈ ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ఆడండి.. ఇంట్లోనే కూర్చొని డబ్బులు గెలవండి'' అంటూ కొన్ని ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఒకప్పుడు బయటకి వెళ్లి జూదం ఆడేవారు.. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఆడుతున్నారు. కేవలం ఈ గేమ్స్ వలన ఎన్నో జీవితాలు నాశనమైన ఘటనలు మనం చాలానే విన్నాం. అయితే ఇప్పుడు లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన జనాలు ఆన్లైన్ జూదాలు ఎక్కువగా ఆడుతున్నారట. ఆన్లైన్ రమ్మీకి బానిసలుగా మారి డబ్బులు మొత్తం పోగొట్టుకుంటున్నారట. అంతేకాకుండా సినిమా హీరో హీరోయిన్స్ ప్రమోట్ చేస్తుండటంతో జనాలకి ఎక్కువగా రీచ్ అవుతున్నాయట. దీంతో సోషల్ మీడియాలో అలాంటి యాప్స్ ని ప్రమోట్ చేయడానికి హీరో హీరోయిన్స్ ఎందుకు ముందుకొస్తున్నారని డిస్కషన్ చేయడం స్టార్ట్ చేసారు నెటిజన్స్. డబ్బుల కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా రెడీ అయిపోతారా.. మీకు సామాజిక బాధ్యత లేదా అంటూ యాడ్స్ ఇచ్చే హీరో హీరోయిన్లను ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి జూదానికి సంభందించిన ఇలాంటి యాప్స్ ని ఇప్పటికే చాలా స్టేట్స్ బ్యాన్ చేసాయి. వాటిలో తెలంగాణ స్టేట్ కూడా ఒకటి. తెలంగాణా ప్రభుత్వం సామాజిక బాధ్యతగా తీసుకొని స్టేట్ లో ఆన్లైన్ రమ్మీ సర్కిల్ యాప్స్ అన్నింటినీ క్లోజ్ చేసింది. కానీ ఈ హీరో హీరోయిన్స్ మాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆలోచించకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుకునే ఇలాంటి ఆటలను ప్రమోట్ చేసి.. వాటిని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. వీరు కూడా తమ వంతు సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఇలాంటి జూదాలకు సంబందించిన యాప్స్ ని ప్రమోట్ చేయడానికి యాడ్స్ ఇవ్వకపోతే బాగుంటుందని వారు సూచిస్తున్నారు. మరి ఇప్పటి నుండైనా ఆ హీరో హీరోయిన్లు సామాజిక బాధ్యత ఫీల్ అవుతారేమో చూడాలి.