లాక్ డౌన్ టైంలో సెలబ్రెటీల మేకప్ కష్టాలు...!

Update: 2020-04-17 00:30 GMT
కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా మరో మూడు వారాలు లాక్ డౌన్ పొడిగించడంతో సెలబ్రెటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలు తమకు దొరికిన ఈ అవకాశంతో కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీతో మిస్ అయిన సమయాన్ని అంతా ఇప్పుడు కవర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. ఇంట్లోనే ఖాళీగా కూర్చున్న ముద్దుగుమ్మలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. కొంతమంది హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తున్నారు. సినిమా షూటింగులు లేక.. టైమ్ పాస్ అవ్వక.. సోషల్ మీడియా పేజీలలో తమ పోస్టులకు లైక్స్ పెంచుకోడానికి.. అభిమానులను పెంచుకోడానికి తెగ కష్ట పడుతున్నారు హీరోయిన్స్ అండ్ యాంకర్స్. లాక్ డౌన్ సమయంలో ఫోటో షూట్స్ అనో.. లేదా  హోమ్ వర్కౌట్స్ అనో.. వంట సెషన్ అనో.. టిక్ టాక్ వీడియోస్ అనో.. ఏదొక పని పెట్టుకొని అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉన్న ఈ  హీరోయిన్స్ అండ్ యాంకర్స్ కి ఒక పెద్ద సమస్య వచ్చి పడిందంట. అదేంటని వీళ్ళకి మేకప్ అనేది ప్రాబ్లెమ్ గా మారిందట.

ఇంట్లో ఉన్నా కూడా ఈ వీడియోలలో కనిపించడానికి అంతో ఇంతో మేకప్ వేసుకోవాల్సిన పరిస్థితి వీళ్లది. మేకప్ తోనే ప్రేక్షకులను అలరించిన వీళ్ళు ఇప్పుడు మేకప్ లేకుండా వీడియోలు చేయాలంటే ఆలోచిస్తున్నారట. దానికి కారణం లేకపోలేదు. ఈ మధ్య ఒక యాంకర్ మేకప్ లేకుండా ఒక వంట ప్రోగ్రామ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందట. ఆ వీడియోకి నెటిజన్లు పెట్టిన కామెంట్స్ కి అమ్మడి కళ్ళు తిరిగాయంట. అంత దారుణమైన రేంజ్ లో కామెంట్స్ పెట్టారట పాపం. వాస్తవానికి ఆ యాంకర్ మేకప్ లేకపోవడంతో వాళ్ళు కామెంట్స్ చేసిన విధంగానే ఉంది. ఈ సమస్య ఒక్క యాంకర్స్ కే కాదు సెలబ్రెటీలు అందరూ పేస్ చేస్తున్నారు. మేకప్ లేకుండా హీరోయిన్స్ పెట్టే వీడియోలకు కూడా నెటిజన్లు ఒక రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారట. ఇప్పుడు ఈ హీరోయిన్లు యాంకర్స్ చాలా మంది మేకప్ కిట్లు లేక ఇబ్బంది పడుతున్నారట. మేకప్ కిట్లు లేకపోవడంతో కొంతమంది సెలబ్రెటీలు అసలు ఆన్ లైన్ కే రావడం లేదట. ఈ కరోనా మహమ్మారి వచ్చి మా మేకప్ కిట్లకే ఎసరు పెట్టిందని వైరస్ ని తిట్టిపోస్తున్నారట. మరి లాక్ డౌన్ ఎత్తేసి వీళ్ళ మేకప్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి.
Tags:    

Similar News