ఫోటో స్టోరి: చీరకట్టులో ఊరిస్తోంది

Update: 2018-01-12 09:32 GMT
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసిన కేరళ కుట్టి కేథరిన్ త్రెసా. ఆ సినిమాలో హైలైట్ గా నిలిచిన అంశాల్లో కేథరిన్ గ్లామర్ కూడా ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. సినిమా అంతా మోడ్రన్ డ్రస్సుల్లో అందాలు ఆరబోస్తూనే కనిపించడంతో కేథరిన్ టాలీవుడ్ కు తెగనచ్చింది. దాంతో ఆమెకు టాలీవుడ్ ఆఫర్లు క్యూ కట్టాయి.

పర్ ఫెక్ట్ బాడీ అండ్ సూపర్ గ్లామర్ కేథరిన్ కు పెద్ద ప్లస్. అటు మోడ్రన్ డ్రస్సులో ఎంతగా మెరిపిస్తుందో.. ఇటు ట్రెడిషనల్ గా చీరకట్టులోనూ అంతగానే మెప్పించగలదు. అందీ అందని అందమే ముద్దు అన్నట్టుగా కనీ కనిపించని నడుము ఒంపులను చూపిస్తూ.. తనకు అలవాటైన చిరునవ్వుతో లేటెస్ట్ గా ఫొటోలకు ఫోజులిచ్చిన కేథరిన్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.  మెరుపుతీగకు చీరకట్టులో కనిపిస్తే.. పాలబొమ్మకు ప్రాణం పోస్తే ఇలాగే ఉంటుందని ఎవరైనా ఒప్పుకుని తీరాలి.  

తన మాతృభాష తెలుగు కాకపోయినా ఇక్కడే తనకు బోలెడు గుర్తింపు వచ్చిందని, అందుకని టాలీవుడ్ కే తన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని కేథరిన్ అంటోంది. అందుకే తెలుగు వస్త్రధారణే కాదు.. తెలుగు భాష కూడా నేర్చేసుకుంటానని అంటోంది.  భాషపై పట్టు పెంచుకునేందుకు ఓ ట్యూటర్ కూడా పెట్టుకుని డైలాగులు ప్రాక్టీస్ చేస్తోందట. ముందుముందు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునే రేంజిలో తెలుగులో మాట్లాడతానంటోంది.
Tags:    

Similar News