• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాస్ రాజా సినిమా అదే అని...

మాస్ రాజా సినిమా అదే అని తేలిపోయింది

By - Tupaki Desk
Update: 2018-05-14 06:09 GMT
మాస్ రాజా రవితేజ కొత్త సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ‘రంగస్థలం’ భారీ విజయంతో ఊపుమీదున్న ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ మాస్ రాజాతో ఒకటికి రెండు సినిమాలు చేస్తుండటం విశేషం. ఆల్రెడీ ఆ సంస్థలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టాడు రవితేజ. ఇప్పుడు ఇదే సంస్థలో సంతోష్ శ్రీనివాస్ దర్శకుడిగా ఓ సినిమా మొదలు కాబోతోంది. ఈ చిత్రానికి కాస్టింగ్ కాల్ ఇచ్చారు. 6-7 ఏళ్ల మధ్య వయసున్న చిన్న పాప పాత్రకు తగ్గ నటి కావాలని పిలుపు ఇచ్చారు. ఈ అప్పీల్‌ ను బట్టే ఈ చిత్రం ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లే తమిళ హిట్ మూవీ ‘తెరి’కి రీమేక్ అని స్పష్టం అయిపోయింది. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అతడి కూతురిగా మీనా కుమార్తె నటించడం విశేషం. ఆ సినిమాకు ఆ పాప ప్రత్యేక ఆకర్షణడగా నిలిచింది. మరి తెలుగులో నటించబోయే కొత్తమ్మాయి ఎలా చేస్తుందో చూడాలి.

తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘తెరి’ సినిమా తెలుగులోకి ‘పోలీస్’ పేరుతో అనువాదమైంది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు పెద్ద ఎత్తునే రిలీజ్ చేశాడు. కానీ అది పెద్దగా ఆడలేదు. అలాంటి సినిమాను మళ్లీ తెలుగులో రీమేక్ చేయడమేంటో? అసలు అది కొత్త సినిమా కూడా కాదు. చాలా సినిమాల కలబోతగా ఉంటుంది. నిజానికి ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ హీరోగా తీయాలనుకున్నారు. కానీ ఆయన అందుబాటులో లేకుండా పోవడంతో మాస్ రాజాతో కానిచ్చేస్తున్నారు. ఎంత మార్పులు చేర్పులు చేసినా మూల కథ అదే ఉంటుంది కాబట్టి తెలుగులో ఈ చిత్రం ఎలా తయారవుతుందో చూడాలి. తమిళంలో విజయ్ సరసన సమంత కథానాయికగా నటించిందీ చిత్రంలో. తెలుగులో ఆ పాత్రకు ఇంకా హీరోయిన్ని ఫైనలైజ్ చేయలేదు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారు.
Tags:    
  • Ravi Teja 
  • Theri Movie Remake 
  • Santosh Srinivas 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS