అభిషేక్ అలా అడిగితే.. జీనత్ ఏమందో తెలుసా?

Update: 2016-11-11 15:37 GMT
జీనత్ అమన్.. ఒకప్పుడు బాలీవుడ్ లో అందరికీ డ్రీమ్ గాళ్. ఈమెపై మనసు పడని వాళ్లు బహుశా ఎవరూ ఉండరేమో? అలనాటి ఈ హీరోయిన్ పై.. అభిషేక్ బచ్చన్ కూడా మనసు పడ్డాడట. తనకు ఫస్ట్ క్రష్ జీనత్ అమన్ అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన అభిషేక్ బచ్చన్.. అప్పట్లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా చెప్పాడు.

అప్పట్లో ఓసారి ఏకంగా తనతో పడుకుంటావా అని జీనత్ అమన్ అడిగేశాడట అభిషేక్. ఈ హీరో అప్పటి వయసు ఐదేళ్లే కాబట్టి పెద్దగా సమస్య రాలేదు. అసలేం జరిగిందంటే.. జీనత్ అమన్ అంటే బోలెడంత ఇష్టం పెంచుకున్న బుల్లి బచ్చన్.. ఆమె దగ్గరకు వెళ్లి.. నువ్వు ఎవరితో పడుకుంటావ్ అని అడిగాడట. "ఒంటరిగానే" అని జీనత్ చెప్పడంతో.. "నేను నీతో పడుకోవచ్చా" అంటూ అమాయకంగా అడిగేశాడట అభిషేక్ బచ్చన్.

దీనికి నవ్వేసిన జీనత్ "కొంచెం పెద్దోడివి అవ్వు.. అప్పుడు" అనిందట. అప్పటి సంగతులను ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పి.. బోలెడంత సిగ్గు పడిపోయాడు అభిషేక్ బచ్చన్. ఏమైనా.. ఆ వయసులోనే అలా అడిగేశాడంటే.. ట్వంటీస్ లో రొమాంటిక్ యాంగిల్ ని అభిషేక్ ఇరగదీసేసి ఉంటాడు కదూ. అందుకే కదా.. ఐశ్యర్యారాయ్ ను చేసుకున్నాడు.. ఏమంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News