పంథా మార్చుకోకపోతే రావిపూడికి కష్టమే!
సక్సెస్ మాత్రమే డైరెక్టర్ల గురించి మాట్లాడుతుంది. వారికి కొత్త అవకాశాలను కూడా తెచ్చిపెడుతుంది. ఫ్లాప్ కూడా మాట్లాడుతుంది కానీ వారి అవకాశాలను గద్దలా తన్నుకు పోతుంది. ఇక సక్సెస్ వచ్చిందని కాస్త రిలాక్స్ అయితే చాలు వెంటనే ఒక ఫ్లాప్ వారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఊపులో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి విషయమే తీసుకుంటే సక్సెస్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు కానీ నిజానికి అనిల్ టైట్ సిచువేషన్ లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే అనిల్ సాధించిన విజయాలు.. తన సినిమాల్లో ఉండే దమ్ము కంటే కూడా ఇతర అంశాలు కలిసివచ్చిన సాధించినవి ఎక్కువ. అనిల్ రావిపూడి మొదటి సినిమా తప్ప మిగతావి అన్ని గాలివాటంగా వచ్చిన విజయాలు అని ఇండస్ట్రీలో ఒక గట్టి అభిప్రాయం ఉంది.
'రాజా ది గ్రేట్' కూడా కొంత వరకూ మేలు అని చెప్పవచ్చు. ఇక మిగతా సినిమాలు ఫ్లూక్ హిట్స్ అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతిసారీ ఇలా అనిల్ రావిపూడికి అన్ని అంశాలు కలిసి వస్తాయని ఏ మాత్రం అనుకోలేం. అనిల్ ప్రస్తుతం 'F3' సినిమాకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. 'F2' సినిమా నిజానికి గొప్పది ఏమీ కాదన్న విషయం అందరికీ తెలుసు. వెంకటేష్ కామెడీ కొంత ఫ్రెష్ గా అనిపించడం.. సంక్రాంతి సీజన్ ఎడ్వాంటేజ్ కలిసిరావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర విజయం సాధించగలిగింది. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా తీస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరించే అవకాశాలు చాలా తక్కువ. 'ఎఫ్ 2' లో మెహ్రీన్ పోషించిన హనీ పాత్ర చాలామందికి నచ్చలేదు. ఇప్పుడు అదే పాత్రను 'ఎఫ్ 3' లో కూడా కొనసాగిస్తున్నారని మెహ్రీన్ కూడా నటిస్తుందని అంటున్నారు.. ఇది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి పోటీలో విజేతగా నిలవక పోవడానికి కారణం అనిల్ రావిపూడి సినిమాల పట్ల కొంత మొనాటనీ ఏర్పడడమే. సంక్రాంతి సీజన్.. మహేష్ బాబు స్టార్డం వల్ల ఆ సినిమా పాస్ అయింది కానీ.. మరో సీజన్లో కనుక రిలీజ్ అయి ఉంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయి ఉండేదని చాలా కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే 'F3' విషయంలో రొటీన్ కామెడీని నమ్ముకోకుండా కొత్తదనం చూపిస్తేనే విజయం సాధించే అవకాశాలు ఉంటాయని ప్రతిసారి ఫ్లూక్ హిట్స్ దక్కవని అంటున్నారు.
ఇదిలా ఉంటే పారితోషికం విషయంలో కూడా అనిల్ రావిపూడి నిర్మాతలకు షాక్ ఇస్తున్నాడని అంటున్నారు. 'F3' సినిమాకు 15 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ అని..కొంత తగ్గించుకోవడం మంచిదని అంటున్నారు. గతంలో బోయపాటి కూడా రెమ్యూనరేషన్ విషయంలో గట్టిగా పట్టుబట్టేవాడని.. ఆయనకు సినిమాలు తగ్గడానికి కారణం అదేనని ఒక టాక్ ఉంది. మరి అనిల్ రావిపూడి కూడా అదే పొరపాటు చేస్తున్నాడని అంటున్నారు.