• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కెరీర్ ఎండ్ అనుకుంటే...

కెరీర్ ఎండ్ అనుకుంటే IFFIలో తేలింది!

By - Tupaki Desk
Update: 2022-11-26 08:30 GMT
గోవా బ్యూటీ ఇలియానా కెరీర్ డ‌ల్ ఫేజ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ్య‌క్తిగ‌త జీవితంలో న‌ష్టం.. విదేశీ ప్రియుడితో బ్రేక‌ప్ వ్య‌వ‌హారం ఈ  భామ‌ను కొంత ఇబ్బంది పెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్ క‌త్రిన కైఫ్ సోద‌రుడితో డేటింగ్ లో ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఆధారాల‌ను బాలీవుడ్ మీడియా ప‌దే పదే లీకులిస్తోంది.

ప్ర‌స్తుతం ఇలియానా సినిమాల్లో న‌టిస్తోందా లేదా? అనే సందేహాలు అభిమానుల‌కు ఉన్నాయి. ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే.. బ్యాక్ బెంచ్ కి ఇల్లీ ప‌రిమిత‌మైపోయింది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ఫోటోషూట్లు త‌ప్ప త‌న సినిమాల గురించి స‌రైన స‌మాచారం లేదు. అయితే ఇలియానా ప్ర‌స్తుతం ఒకే ఒక్క సినిమాలో న‌టిస్తోంది. రణదీప్ హుడా- ఇలియానా డి క్రూజ్ నాయ‌కానాయిక‌లుగా నటించిన 'తేరా క్యా హోగా లవ్లీ' త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానుంది. ప్ర‌స్తుతం IFFI ఉత్స‌వాల్లోలో ఇలియానా స‌హా చిత్ర‌బృందం ప్రీమియ‌ర్ కోసం సంద‌డి చేస్తోంది.

తేరా క్యా హోగా లవ్లీ హర్యానా నేపథ్యంలో సాగే ఒక సామాజిక కామెడీ డ్రామా. ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తిక‌రం. సామాజిక దురభిమానాన్ని భరించే ముసలి (వృద్ధ‌) చర్మం గల అమ్మాయి చుట్టూ క‌థాంశం తిరుగుతుంది. మ‌గువ వృధ్యాప్యం గురించే కాదు.. అంద‌మైన‌ శ‌రీరం రంగు పొంగుపై స‌మాజం క‌న్ను ఎలా ఉంటుంద‌నే కోణాన్ని కూడా ఈ సినిమా ఆవిష్క‌రిస్తుంది. కాస్త వ‌య‌సు మీరాక శ‌రీరం దాని య‌వ్వ‌నాన్ని కోల్పోతుంది. ఆ త‌ర్వాత స‌మాజం ఎలా ప్ర‌భావిత‌మ‌వుతుందో కూడా తెర‌పై ఫ‌న్నీగా సెటైరిక‌ల్ గా చూపించారుట‌. భారతదేశంలో అందంపై మక్కువ ఎలా ఉంటుంద‌నేది హ్యూమ‌ర‌స్ గా ఎలివేట్ చేసార‌ని స‌మాచారం.

కంటెంట్ ప‌రంగా ఇది అవార్డుల సినిమా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇంత‌కుముందు ర‌ణ‌బీర్ స‌ర‌స‌న ఇలియానా బ‌ర్ఫీ లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించ‌డ‌మే గాక అవార్డులు రివార్డులు కొల్ల‌గొట్టింది. ఇప్పుడు మ‌రోసారి ర‌ణ‌దీప్ తో క‌లిసి అలాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో ఇలియానా న‌టించింద‌ని చెబుతున్నారు. మూవీ టన్నెల్ ప్రొడక్షన్స్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.

ప్ర‌స్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 53వ ఎడిషన్ లో శుక్రవారం 'తేరా క్యా హోగా లవ్లీ'  ప్రీమియర్ ని స్క్రీనింగ్ చేసారు. నెట్ ఫ్లిక్స్ సిరీస్ క్యాట్ లో రణ్ దీప్ తో కలిసి పనిచేసిన బల్విందర్ సింగ్ జంజువా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రూపిందర్ చాహల్- అనిల్ రోధన్ - కునాల్ మండేకర్ లతో కలిసి బ‌ల్వింద‌ర్ స్వ‌యంగా రచన కూడా చేసారు.

IFFI 2022లో ప్రీమియర్ గురించి రణదీప్ మాట్లాడుతూ-''ఐఎఫ్‌.ఎఫ్‌.ఐలో తేరా క్యా హోగా లవ్లీని ప్రదర్శించినందుకు సంతోషం. ఈ ప్రత్యేక చిత్రాన్ని థియేట‌ర్ల‌లో ప్రేక్షకులు  వీక్షించబోతున్నారు. ఇది నేటి స‌మాజానికి క‌నెక్టివ్ గా ఉండే చాలా ముఖ్యమైన అంశాన్ని ఎలివేట్ చేస్తుంది. ఇలియానా తో మొదటిసారి కలిసి పని చేసాను. ప్రేక్షకుల అంచనాలను అందుకోగలమని ఆశిస్తున్నాం'' అన్నారు.

ఇలియానా మాట్లాడుతూ-''బలమైన సందేశాన్ని ఇస్తూనే నవ్వించగల సినిమాలు చాలా అరుదు. ఆ రెండు అంశాలు మా చిత్రం తేరా క్యా హోగా లవ్లీలో ఉన్నాయి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ లో మా దర్శకుడు బల్వీందర్ సింగ్ జంజువా చేసిన ఆస‌క్తిక‌ర ప్ర‌యోగ‌మిది. ఈ చిత్రాన్ని మొదటిసారిగా తెర‌పై వీక్షించే అనుభవించడం కోసం వేచి చూడండి. ఈ చిత్రానికి ఘనంగా ప్రీమియర్ షోని నిర్వ‌హించేందుకు అవకాశం కల్పించినందుకు IFFIకి కృతజ్ఞతలు'' అని అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • GoaBeauty 
  • IleanaDCruzz 
  • IFFI 
  • Bollywood 
  • Tollywood 
  • TeraKyaHogaLovely 
  • RandeepHooda 
  • SonyPictures 
  • MovieNews 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS