• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్-బన్నీ సమరం పక్కా!

మహేష్-బన్నీ సమరం పక్కా!

By - Tupaki Desk
Update: 2017-10-28 10:25 GMT
ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ మధ్య రసవత్తర బాక్సాఫీస్ సమరం చూశాం. వచ్చే ఏడాది సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో బాలయ్య అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఐతే సంక్రాంతికి ఇలా ఇద్దరు పెద్ద స్టార్లు ఢీకొట్టడం అలవాటైన విషయమే. కానీ వేసవి సీజన్లో ఒకే రోజు రెండు భారీ సినిమాలు రేసులో నిలవడం అరుదైన విషయమే. వచ్చే వేసవిలో ఈ చిత్రమే చూడబోతున్నాం. అల్లు అర్జున్-వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’ సినిమా మొదలైనపుడే వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ అని ప్రకటించారు. కానీ కొన్ని రోజుల కిందటే మహేష్-కొరటాల శివ సినిమాను అదే తేదీకి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీని గురించి టాలీవుడ్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక.. ఇంకో పెద్ద సినిమా రేసులోకి రావడమేంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఒకవేళ ‘నా పేరు సూర్య’ ఆ తేదీకి రావట్లేదా.. వాయిదా పడ్డ సంగతి తెలిశాకే ‘భరత్ అను నేను’ ఇలా రేసులోకి వచ్చిందా అని సందేహించారు. ఐతే తమ సినిమా విడుదల తేదీలో ఏ మార్పూ లేదంటూ ‘నా పేరు సూర్య’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఈ రోజు ప్రకటించాడు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన ‘నెక్స్ట్ నువ్వే’కు సంబంధించిన ప్రెస్ మీట్లో బన్నీ వాస్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. దీన్ని బట్టి బన్నీ అండ్ కో మహేష్ అండ్ టీంకు సవాలు విసిరినట్లే. మరిప్పుడు ‘భరత్ అను నేను’ టీం ఏం చేస్తుందో చూడాలి. వాళ్లు కూడా పంతానికి పోతే 2018 ఏప్రిల్ 27న మహేష్ వెర్సస్ బన్నీ వార్ చూడబోతున్నామన్నమాట.
Tags:    
  • Bunny Vasu 
  • Allu Arjun 
  • Naa Peru Surya movie 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS