అక్కడ పవన్ కంటే బన్నీదే పై చేయి కావచ్చు!
బాహుబలి వచ్చినప్పటి నుండి కూడా సౌత్ స్టార్ హీరోలు ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. యూనివర్శిల్ సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకుని ఉత్తరాది ప్రేక్షకులను అలరించే ప్రయత్నాలు చేస్తున్నారు. సాహో చిత్రం సౌత్ లో కంటే అక్కడే ఎక్కువ వసూళ్లను రాబట్టిందని విశ్లేషకుల అంచనా. దాంతో కంటెంట్ ఉంటే తప్పకుండా సౌత్ సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది. అందుకే మరిన్ని తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయ్యేందుకు రెడీ అవుతున్నాయి.
ప్రస్తుతం అందరి దృష్టి మెగా హీరోలు పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ లు నటిస్తున్న రెండు సినిమాలపై ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతున్న విరూపాక్ష చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దర్శకుడు క్రిష్ కు ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన బ్రాండ్ ఇమేజ్ తో ఈ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. క్రిష్ గత చిత్రాల ఫలితాల కారణంగా ఈ సినిమా కూడా అక్కడ మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ తన పుష్ప చిత్రంతో హిందీ ప్రేక్షకులతో పాటు మొత్తం అయిదు భాషల ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యూనివర్శిల్ కాన్సెప్ట్ అని తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందని అంటున్నారు. అల్లు అర్జున్ పాత సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ లో శాటిలైట్ ఛానెల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయ్యాయి.
హిందీ ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ కు అంతో ఇంతో గుర్తింపు ఉంది. కాని పవన్ ఇక్కడ పవర్ స్టార్ అయినా అక్కడ మాత్రం పెద్దగా తెలియదు. కనుక సినిమా ఓపెనింగ్స్ విషయంలో పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ దే పై చేయి అవ్వొచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమాతో అక్కడ మరింతగా స్టార్ డంను దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.
పవన్ గతంలో ఒక సినిమాతో హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లగా తీవ్రమైన పరాభవం ఎదురైంది. ఇక్కడ పవన్ ను బన్నీ మించలేకున్నా ఉత్తరాదిన మాత్రం ఖచ్చితంగా పవన్ పై బన్నీ పై చేయి సాధిస్తాడనే నమ్మకంను అల్లు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.