`పుష్ప‌` వెన‌కున్న ఇంట్రెస్టింగ్ స్టోరీని బ‌న్నీ చెప్పేశాడు

Update: 2021-12-09 09:31 GMT
`అల వైకుంఠ‌పుర‌ములో` ఇండ‌స్ట్రీ హిట్ కావ‌డంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న భ‌విష్య‌త్ సినిమాల‌పై త‌న ప‌ర్షెప్ష‌న్ ని మార్చుకున్నారు. త‌ను చేయ‌బోయే సినిమా పాన్ ఇండియా స్థాయికి ఏమాత్రం త‌గ్గ‌ని స్థాయిలో వుండాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఇప్పుడు `పుష్ప`ని చేస్తున్నారు.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ముందు ఒకే సినిమా అనుకుని ఆ త‌రువాత రెండు పార్ట్‌లుగా మార్చిన ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప : ది రైజ్‌` ఈ నెల 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సుకుమార్ - బ‌న్నీల కాంబినేష‌న్ కావడం.. బ‌న్నీ తొలిసారి ఊర‌మాస్ పాత్ర‌లో గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్‌గా న‌టిస్తున్న సినిమా కావ‌డం వంటి కార‌ణాల‌తో ఈ సినిమాపై స‌హ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అంతే కాకుండా బ‌న్నీ - సుక్కు - దేవి కాంబినేష‌న్ కావ‌డం కూడా ఈ సినిమాపై అంచ‌నాలు స్కై హైకి చేరేలా చేశాయి. అయితే ఈ సినిమా ఎలా పుట్టిందో తాజాగా ఢీ 13 డ్యాన్స్ రియాలిటీ షో సాక్షిగా చెప్పేశాడు.

సుకుమార్ - నేను క‌లిసి సినిమా చేయాల‌ని అనుకున్న‌ప్పుడు స‌రైన క‌థ‌తోనే రావాల‌ని ముందే ఫిక్సయ్యాం. సుక్కు కూడా స‌రైన క‌థ‌తోనే నీ ద‌గ్గ‌రికి వ‌స్తాన‌ని.. నీతో మామూలు సినిమా మాత్రం చేయ‌న‌ని చెప్పాడ‌ని.. ఆ త‌రువాత కొన్నాళ్ల‌కు స‌రైన క‌థ‌తో నా ముందుకు వ‌చ్చాడ‌ని సుక్కు తెచ్చిన క‌థ విన్న త‌రువాత ఇది నాకు స‌రైన క‌థ అనిపించింద‌ని అందుకే ఈ సినిమా చేశామ‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. అంతే కాక‌కుండా సుక్కుతో త‌న‌కు ఎమోష‌న‌ల్ బాండింగ్ వుంద‌ని చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News