• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాన్న కూచి అర్హ కోసం...

నాన్న కూచి అర్హ కోసం సెట్లో బ‌న్ని ఫాల్క‌న్

By - Tupaki Desk
Update: 2021-08-07 14:30 GMT
స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అత్యంత ఖ‌రీదైన `ఫాల్క‌న్-బ‌స్` గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సుమారు 7కోట్ల బ‌డ్జెట్ తో స‌క‌ల సౌకర్యాలతో తీర్చిదిద్దిన ప్ర‌త్యేక ల‌గ్జ‌రీ కార‌వాన్ ఇది. బ‌న్నీ ఎక్క‌డ షూటింగ్ కి వెళ్లినా  సెట్స్ లో ఫాల్కన్ బ‌న్నీ కంటే ముందుగా ఉండాలి. బ‌న్నీ షాట్ గ్యాప్ లో కొన్ని నిమిషాలపాటు విశ్రాంతి తీసుకోవాల‌న్నా పాల్కాన్ లోకి వెళ‌తారు. కానీ స‌డెన్ గా ఏమైందో ఫాల్కాన్ బ‌న్నీకి అందుబాటులో లేద‌ని తెలిసింది. ఫాల్క‌న్ కి బ‌దులుగా ఓ స్టాండ‌ర్డ్ కార‌వాన్ ని ఏర్పాటు చేసుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. మ‌రి పాల్కాన్ రిపేర్ వ‌గైరా ఏమైనా జ‌రిగిందా? అంటే అదీ లేదు. కేవ‌లం త్యాగం చేయ‌డంతోనే బ‌న్నీ  స్టాండ‌ర్డ్ కార్వాన్ వినియోగించాల్సి వ‌స్తోంది. అస‌లు విష‌యంలోకి వెళ్తే..

అల్లు అర్జున్  కుమార్తె అల్లు అర్హ కోసం ఫాల్క‌న్ ని పంపించార‌న్న‌ది తాజా గుస‌గుస‌. అక్కినేని స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణ‌శేఖ‌ర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న `శాకుంత‌లం` సెట్స్ లో అల్లు అర్హ బిజీగా ఉంది. అర్హ ఈ చిత్రంలో బాల న‌టిగా న‌టిస్తోంది. అర్హ‌కి తొలి ప‌రిచ‌య చిత్రం కావ‌డంతో త‌న‌ రోల్ కూడా అంతే ప్రాధాన్యత‌ను క‌లిగి ఉందిట‌. ఈ నేప‌థ్యంలో అర్హ  రెగ్యుల‌ర్ గా శాకుంత‌లం షూటింగ్ కి హాజ‌ర‌వ్వాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ద‌ర్శ‌కుడి నుంచి అర్హ‌కి పిలుపు రావ‌డంతో షూటింగ్ కి రెడీ అయింది. అటు బ‌న్నీ న‌టిస్తున్న `పుష్ప` చిత్రీక‌ర‌ణ‌ కూడా నిర్విరామంగా జ‌రుగుతోంది. బ‌న్నీ బ్రేక్  ఇవ్వ‌డానికి లేదు. ఇలా రెండు సినిమాలు షూటింగ్ లో ఉండ‌టం...బ‌న్నీ..అర్హ కూడా ఒకేసారి సెట్స్ కు హాజ‌ర‌వుతుండ‌డంతో బ‌న్నీనే కుమార్తె కోసం అలా అడ్జ‌స్ట్ అవుతున్నారు.

గారాల కుమార్తె కోసం బ‌న్నీ పాల్కాన్ ని కేటాయించారు. అర్హ‌కి షూటింగ్ ఉన్నంత కాలం పాల్క‌న్ త‌న వ‌ద్ద ఉండాల‌ని బ‌న్నీ  ఆదేశాలు  ఇవ్వ‌డంతో పాల్క‌న్ ఇప్పుడు అర్హ అండ‌ర్ లో  ఉంది. అర్హ‌తో పాటు షూటింగ్ సెట్ లో ఫాల్కన్ ఉంటుంది. ఫాల్కాన్ అర్హ‌తో లేక‌పోతే సెట్స్ లో  ఇబ్బంది ప‌డుతుంద‌ని భావించి బ‌న్నీ అన్ని సౌక‌ర్యాలు ఉన్న త‌న కార‌వ్యాన్ ని కుమార్తెకు కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. ఇక బ‌న్నీ సాధార‌ణ కార‌వాన్ ని వాడుతున్నారు. కూతురంటే బ‌న్నీకి ఎంత ప్రేమో క‌దా..!
Tags:    
  • allu arha 
  • allu arha photos 
  • allu arha video 
  • allu arha debut movie 
  • Shakuntalam 
  • samantha Shakuntalam 
  • Allu arha in Shakuntalam 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS