• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ ను విజయనగరం...

ఎన్టీఆర్ ను విజయనగరం తీసుకెళ్లబోతున్న బుచ్చి

By - Tupaki Desk
Update: 2022-01-28 13:30 GMT
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కోసం దాదాపుగా నాలుగు ఏళ్ల సమయం కేటాయించాడు. ఇప్పటికే ఆ సినిమా విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా వల్ల ఆలస్యం అవుతోంది. కరోనా వల్ల తదుపరి సినిమా కూడా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో కన్ఫర్మ్‌ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ తో ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సినిమా కూడా మొదలు అవ్వాల్సి ఉంది. మొదటి సినిమా తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బుచ్చి బాబు తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నట్లుగా అధికారికంగా చెప్పలేదు కాని ఆయన ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేస్తున్నట్లుగా చెప్పకనే పలు సందర్బాల్లో.. పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ మరియు బుచ్చి బాబు ల కాంబో మూవీ పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.

ఈ సమయంలో ఎన్టీఆర్ కోసం బుచ్చి బాబు రెడీ చేసిన కథ గురించి మీడియా వర్గాల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కథ ఎక్కువగా విజయనగరం ప్రాంతంలో జరుగుతుందని సమాచారం అందుతోంది. షూటింగ్ లో మెజార్టీ భాగం కూడా విజయనగరం మరియు పరిసర ప్రాంతాల్లోనే షూట్ చేయబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఇప్పటికే దర్శకుడు బుచ్చి బాబు అక్కడ లొకేషన్స్ ను కూడా పట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. కథ చాలా సింపుల్ గా ఉంటుందని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్‌ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్‌ గుర్తింపు దక్కించుకోబోతున్నాడు. అయితే అందుకు విభిన్నంగా ఈ సినిమా పాన్ ఇండియా స్క్రిప్ట్‌ కాకుండా తెలుగు నేటివిటీతో ఉండే కథలా ఉంటుందని కొందరు అంటున్నారు. మరి ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమా విషయమై దర్శకుడు బుచ్చి బాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ సినిమా పట్టాలెక్కాలంటే ఖచ్చితంగా ఈ ఏడాది చివరి వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు.

సుకుమార్‌ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బుచ్చి బాబు మొదటి సినిమా తోనే వంద కోట్ల వసూళ్లను దక్కించుకుని రికార్డు సృష్టించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఏ దర్శకుడు కూడా ఈ అరుదైన రికార్డును దక్కించుకోలేదు. కాని బుచ్చి బాబు మాత్రం అనూహ్యంగా వంద కోట్ల వసూళ్లు దక్కించుకుని రెండవ సినిమా తోనే ఏకంగా ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్‌ తో సినిమా ను చేసే అవకాశం దక్కించుకున్నాడు. అయితే ఆయన కరోనా వల్ల వచ్చిన అద్బుత అవకాశం ఆలస్యం అవుతుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఎన్టీఆర్ మరియు బుచ్చి బాబు కాంబో మూవీ వచ్చే ఏడాది లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ మరియు బుచ్చి బాబు ల కాంబో మూవీ పై మొదటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇప్పుడు కథ విషయమై వస్తున్న వార్తలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. సినిమా కు సంబంధించిన షూటింగ్‌ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అంటూ ప్రతి ఒక్కరు కూడా వెయిట్‌ చేస్తున్నారు. కొరటాల శివ తో చేయబోతున్న సినిమా తర్వాత కేజీఎఫ్‌ ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్‌ సినిమా చేయాల్సి ఉంది. ఈ మూడు ప్రాజెక్ట్‌ లు మాత్రమే కాకుండా ఎన్టీఆర్‌ మరో రెండు మూడు సినిమాలకు కూడా ఓకే చెప్పాడు. అవి ఎప్పటి వరకు మొదలు అయ్యేది క్లారిటీ లేదు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్‌ సినిమా మూడ్ నుండి బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమా కోసం కాస్త బాడీ కూడా పెంచాడు. ఇప్పుడు కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
Tags:    
  • ntr 
  • buchibabu 
  • vijayanagaram 
  • storynarrates 
  • movienews 
  • tupakiupdates 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS