'బ్రదర్స్ డే' స్పెషల్: 'టాలీవుడ్ అన్నదమ్ములు'

Update: 2021-05-24 12:30 GMT
నేడు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. ఏప్రిల్ 10న నేషనల్ సిబ్లింగ్స్ డే మాదిరిగానే, ప్రతి సంవత్సరం మే 24న బ్రదర్స్ డే జరుపుకుంటారు. ఫాదర్స్‌ డే - మదర్స్‌ డే - లవర్స్‌ డే మాదిరిగానే 'బ్రదర్స్‌ డే' ను కూడా ప్రపంచ దేశాలు నిర్వహించుకుంటున్నారు. రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములనే కాకుండా.. మనతో ఆత్మీయంగా ఉండే స్నేహితులను కూడా సోదరులుగా భవిస్తూ.. ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. బ్రదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ లోని బ్రదర్స్ లిస్ట్ ఇప్పుడు ఒక్కసారి చూద్దాం!

స్వయంకృషితో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవిని నమ్ముకొని అనేక మంది అడుగుపెట్టారు. తమ్ముళ్లు నాగబాబు - పవన్ కళ్యాణ్ అన్న బాటలో నడుస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణతో పాటుగా హరికృష్ణ కూడా హీరోగా సినిమాలు చేశారు. ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన అన్నదమ్ములు క‌ళ్యాణ్ రామ్ - జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా హీరోలుగా రాణిస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీ మూడో తరంలో నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చిన్న కొడుకు అఖిల్ కూడా హీరోగా పరిచయం అయ్యాడు. కృష్ణ తనయులు రమేష్ బాబు - మహేష్ బాబు ఇద్దరూ హీరోలుగా ఇంట్రడ్యూస్ అయ్యారు. అలానే దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు రానా హీరోగా రాణిస్తుండగా.. ఇప్పుడు అతని తమ్ముడు అభిరామ్ ని హీరోగా లాంచ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన అల్లు అర్జున్, బాటలోనే తమ్ముడు అల్లు శిరీష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్రదర్స్ విష్ణు - మనోజ్ కూడా హీరోలుగా కొనసాగుతున్నారు. అలానే మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా నిలదొక్కుకోడానికి ట్రై చేస్తుంటే.. తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా హీరోగా పరిచయం అయ్యాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా మారిన సంగతి తెలిసిందే. వీరి బాటలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.

ఈవీవీ సత్యనారాయణ తనయులు అల్లరి నరేష్ - ఆర్యన్ రాజేష్ ఇద్దరూ హీరోలుగా సినిమాలు చేశారు. రవితేజ సోదరులు రఘు - భరత్ కూడా హీరోలుగా తమ లక్కుని పరీక్షించుకున్నారు. శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా హీరోగా కొన్ని సినిమాలు చేసాడు. అలీ బ్రదర్ ఖయ్యుం కూడా హీరోగా ప్రయత్నాలు చేసాడు. ఇలా టాలీవుడ్ లో అన్న ను అనుసరిస్తూ తమ్ముళ్లు కూడా హీరోలు అయ్యారు. అయితే వాళ్లలో కొందరు హీరోలుగా నికదొక్కుకుంటే.. మరికొందరు మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు.
Tags:    

Similar News