ఆ విషయంలో పవన్ తర్వాత స్థానం మాస్ రాజాదే!
ఎంత పెద్ద డైరెక్టర్ కి అయినా ముందు సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చేది. లేదంటే ఏ స్టార్ హీరో కూడా ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు రాడు.;
ఎంత పెద్ద డైరెక్టర్ కి అయినా ముందు సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చేది. లేదంటే ఏ స్టార్ హీరో కూడా ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు రాడు. ఇప్పుడిదంతా ఓ పెన్ సీక్రెట్. ఎలాంటి దాపరికాలు..నిర్మొహమా టాలు మాటాలు ఉండటం లేదు. హిట్ ఉంటేనే ఆ డైరెక్టర్ కూడా తాను అనుకున్న హీరోకి కథ చెప్పాలను కుంటున్నాడు. లేదంటే? వెనక్కి తగ్గుతున్నారు. ఎలాగైనా ఆహీరోతోనే పని చేయాలనే మొండి పట్టుదలకు పోయి సమయాన్ని వృద్దా చేసుకోవడం లేదు. వరుస హిట్లున్న హీరో విషయంలో అసలే ఇన్వాల్స్ అవ్వడం లేదు.
అడిగి లేదనిపించుకోవడం ఎందుకని సైలెంట్ గా ఉంటున్నారు. కానీ టాలీవుడ్ లో ఓ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం దర్శకులు విజయాలతో సంబంధం లేకుండా అవకాశం కల్పిస్తున్నారు. ఆ హీరోలకు వాళ్లపై నమ్మకం కలిగితే చాలు వారి చెప్పిన కథ నచ్చితే? గత విజయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. కథ నచ్చిందంటే లాక్ చేసి పట్టాలెక్కిస్తున్నారు. వారిలో మొదటి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయనకు కథ నచ్చితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డుతో సంబంధం లేదు. గతంలో ఓ విజయం ఇచ్చిన రికార్డు ఉంటే? ఇంకాస్త చనువుగా మూవ్ అవుతారు.
ఈ మధ్య కాలంలో అలా చాలా మంది ఫెయిల్యూర్ దర్శకులు ఛాన్సులు అందుకున్నారు. సుజిత్, హరీష్ శంకర్, క్రిష్, జ్యోతికృష్ణ, సాగర్ కె. చంద్ర అలా ఛాన్సులు అందుకున్న వారే. నమ్మి అవకాశం ఇచ్చినా వారు మాత్రం సరైన బ్రేక్ ఇవ్వలేకపోయారు. తాజాగా 'ఏజెంట్' తో రెండేళ్లగా ఖాళీగా ఉన్న సురేందర్ రెడ్డి కూడా పవన్ తో ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత పట్టాలెక్కేది సూరి చిత్రమే. సరిగ్గా మాస్ రాజా రవితేజ కూడా పవన్ మార్గంలోనే ఉన్నారు. ఆ విషయంలో రెండవ స్థానం ఇతడిదే.
రవితేజ వరుస ప్లాప్ ల్లో ఉన్నా? అంతకు మించి ప్లాప్ ల్లో ఉన్న హరీష్ శంకర్ తో 'మిస్టర్ బచ్చన' చేసాడు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు సురేందర్ రెడ్డిని కూడా ఇలాగే రిపీట్ చేసాడు. శ్రీనువైట్ల సహా మరికొంత మందికి ఫెయిల్యూర్స్ సమయంలో రవితేజ ఛాన్స్ లిచ్చాడు. ఇలాంటి వాళ్లతో పాటు ,కొత్త దర్శకుల్ని నమ్మి అవకాశం ఇవ్వడం మాస్ రాజా ప్రత్యేకత.