భగ్నప్రేమికులకు బ్రేకప్ గీతాన్ని కానుకిస్తాడట
అవును అతడు ప్రేమలో మునిగి తేలాడు. చివరకు ప్రియురాలితో బ్రేకప్ అయ్యింది. ఇప్పుడంతా సోలో బతుకే అయ్యింది. ఏమిటో ఈ మాయ.. ఇక ఇంతేనా? అందుకేగా ఈ బ్రేకప్ సాంగ్. మనసు గతి ఇంతేగా..!
ప్రేమకథా చిత్రాల్లో బ్రేకప్ సాంగ్ లకు ప్రత్యేక స్థానం వుంటుందన్నది తెలిసిందే. లవ్ లో పడిన ప్రతీ ఒక్కడికీ అది ఎప్పుడో ఒకప్పుడు కామన్‌గా ఎదరయ్యే సమస్యే. దీనిపై ఇప్పటి వరకు ఎన్నో గీతాలొచ్చాయి. లవ్ ఫెయిల్యూర్ అయిన యువతని ఉర్రూతలూగించాయి. అయితే... బట్ ఏ ఛేంజ్ అంటున్నాడు మెగా హీరో సాయి ధరమ్‌తేజ్.
బ్రేకప్ గీతాలకు తను సరికొత్త నిర్వచనం ఇస్తానంటున్నాడు. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం `సోలో బ్రతుకే సోబెటర్`. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. సింగిల్ ఫర్ ఎవర్ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన బ్రేకప్ సాంగ్ అంథెమ్‌ని ఈ 15న చిత్ర బృందం రిలీజ్ చేస్తోంది. అయితే బ్రేకప్ సాంగ్ లకు కాస్త భిన్నంగా ఈ పాట వుండబోతోందిట.
ఇందు కోసం సంగీత దర్శకుడు తమన్ భిన్నమైన స్వరాలు అందిస్తున్నారు. థర్డ్ సింగిల్ గా విడుదల కానున్న ఈ `అమృత` సాంగ్ ని 15 ఉదయం 10 గంటలకు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు. భగ్నప్రేమికులకు బ్రేకప్ గీతాన్ని అమృత.. పేరుతో కొత్తగా నిర్వచిస్తున్నాం. ఈ నెల 15 ఉదయం 10 గంటలకు ఈ పాటని మీ కోసం రిలీజ్ చేస్తున్నాం` అని మేకర్స్ వెల్లడించారు.