• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైల‌ర్ టాక్: బాబు...

ట్రైల‌ర్ టాక్: బాబు బ్రాండెడే కానీ...

By - Tupaki Desk
Update: 2018-07-26 07:35 GMT
మారుతి రాసే క‌థ‌లు గ‌మ్మ‌త్తుగా ఉంటాయి. క‌థానాయ‌కుడికి ఏదో ఒక డిజార్డ‌రో లేదంటే ఒక విచిత్ర‌మైన అల‌వాటో ఉంటుంది. దాని చుట్టూనే క‌థ అల్లుతుంటాడు. అవి ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవుతుంటాయి. తాజాగా `బ్రాండ్ బాబు` పేరుతో ఆయ‌న రాసిన క‌థ తెర‌కెక్కింది. ప్రభాక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో క‌న్న‌డ హీరో సుమంత్ శైలేంద్ర - ఇషా రెబ్బా జంట‌గా న‌టించారు. ఆగ‌స్టు 3న ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న ఈ సినిమా ట్రైల‌ర్ ఈ రోజు విడుద‌లైంది.  అది ప‌క్కాగా మారుతి మార్క్‌ లో సాగుతుంది.

పేరు డైమండ్‌. డైమండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అధినేత.. అంటూ హీరో త‌న గురించి చెప్ప‌డం మొద‌లుపెడ‌తాడు.  ఈ డైమండ్ బాబుకి - ఆయ‌న కుటుంబానికి విచిత్ర‌మైన ఓ అల‌వాటు ఉంటుంది. అదేంటంటే బ్రాండెడ్ వ‌స్తువుల్ని మాత్ర‌మే వాడ‌టం. కానీ  ఈ బ్రాండ్‌ బాబు ఒక బ‌ల‌హీన క్ష‌ణంలో రోడ్‌ సైడ్ బ్రాండ్‌ ని చూసి మ‌న‌సు పారేసుకొంటాడు. అంటే ఒక ఇంట్లో ప‌నిమనిషి అయిన అమ్మాయిని చూసి ప్రేమిస్తాడ‌న్న‌మాట‌. మ‌రి  ఆ ప‌నిమ‌నిషికీ - బ్రాండ్ బాబుల‌కీ కుదిరిందా లేదా?  అనేదే ఈ చిత్రం.  ట్రైల‌ర్‌ లో కావ‌ల్సినంత ఫ‌న్ ఉంది. ముఖ్యంగా ఇషా అందంగా క‌నిపించింది. ముర‌ళీశ‌ర్మ కీ రోల్ పోషించిన‌ట్టు తెలుస్తోంది. న‌ల్ల‌వేణు - సాయి పంప‌న‌తో పాటు ప‌లువురు కామెడీ న‌టులు ఇందులో సంద‌డి చేయ‌బోతున్నారు. కామెడీ - ఎమోష‌న్స్ క‌లిపి ఈ సినిమా వండిన‌ట్టు తెలుస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    
  • Maruthi 
  • Brand Babu Movie 
  • Brand Babu Movie Trailer 
  • Telugu News 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS