• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నింగిలో 'బ్ర‌హ్మాస్త్ర'...

నింగిలో 'బ్ర‌హ్మాస్త్ర' లోగో ఆవిష్క‌ర‌ణ‌

By - Tupaki Desk
Update: 2019-03-05 04:40 GMT
ప్ర‌చార వైవిధ్యం లేనిదే సినిమాని గుర్తించ‌డం క‌ష్టం. ఏదో ఒక కొత్త‌ద‌నం లేనిదే.. క్రియేటివ్ ఎప్రోచ్ లేనిదే జ‌నంలోకి దూసుకెళ్ల‌డం క‌ష్టం. అందుకే ప్ర‌చార వైవిధ్యం కోసం పాకులాట‌. అది బాలీవుడ్ అయినా.. టాలీవుడ్ అయినా.. ఇంకెక్క‌డైనా వ‌ర్తిస్తుంది. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఇది అనుస‌ర‌నీయం. ఇటీవ‌ల ఈ ప‌ద్ధ‌తి మ‌రింత పీక్స్ కి చేరుకుంది. అమీర్ ఖాన్ - షారూక్ - స‌ల్మాన్ - ర‌ణ‌వీర్ సింగ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇలా అంద‌రూ ప్ర‌చారం వైవిధ్యం కోసం త‌పించిన‌వారే.

తాజాగా అదే పంథాలో క‌ర‌ణ్ జోహ‌ర్ నిర్మిస్తున్న భారీ మల్టీస్లార‌ర్ `బ్ర‌హ్మాస్త్ర‌` ప్ర‌మోష‌న్ సాగింది. బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ - రణ్‌ బీర్‌ కపూర్‌ - అలియాభట్ లాంటి స్టార్స్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున ఓ కీలకపాత్రలో పోషించిన సంగ‌తి విదిత‌మే. మ‌హాశివ‌రాత్రి కానుక‌గా అభిమానుల కోసం ఈ సినిమా లోగోని వైవిధ్యంగా లాంచ్ చేశారు. నింగిలోకి బ్ర‌హ్మాస్త్రం సంధించ‌డం ఇక్క‌డ ఆస‌క్తి క‌లిగించే విష‌యం.

గ‌త కొంత‌కాలంగా ప్ర‌యాగ స‌హా కాశీ, వార‌ణాసి లో శివ‌ భక్తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. కుంభ‌మేళా పేరుతో హోమాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జ‌నం దృష్టి ఈ కుంభ‌మేళాల‌పై నిలిచి ఉంది. అందుకే ఈ వేదిక వ‌ద్ద బ్ర‌హ్మాస్త్ర లోగోని లాంచ్ చేశారు. అది కూడా నింగిలో లోగోని లాంచ్ చేయ‌డం అనేది సంథింగ్ స్పెష‌ల్ గా నిలిచింది. డ్రోన్ల సాయంతో ఈ లోగోని ఆవిష్క‌రించడం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. చూప‌రుల‌కు అదో బ్ర‌హ్మాండంలా అనిపించింది. అఘోర విన్యాసాల న‌డుమ లోగో లాంచ్ అన్న ప్లాన్ పెద్ద రేంజులోనే వ‌ర్క‌వుటైంది. ఈ కుంభ‌మేళాలో చిత్ర‌యూనిట్ పూజ‌లు ఆచ‌రించింది. ఈ కార్యక్రమంలో రణ్‌బీర్‌ కపూర్‌ - అలియా భట్‌ - అయాన్‌ ముఖర్జీ పాల్గొన్నారు. ధర్మ మూవీస్ ప‌తాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `ఏ జవానీ హై దీవానీ` ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 2019 మోస్ట్ అవైటెడ్ మ‌ల్టీస్టార‌ర్ గా ఇప్ప‌టికే బ్ర‌హ్మాస్త్ర పేరు మార్మోగుతోంది. ఇందులో కింగ్ నాగార్జున న‌టిస్తుండ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ అన‌డంలో సందేహం లేదు.
   

Tags:    
  • Alia Bhatt 
  • Ranbir Kapoor 
  • Amitabh Bachchan 
  • Brahmastra Movie 
  • Telugu News 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS