• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ యాక్టర్ ఎవరికైనా...

ఆ యాక్టర్ ఎవరికైనా ఫ్రెండే

By - Tupaki Desk
Update: 2017-10-11 05:02 GMT
సీనియర్ హీరోలకు ఫ్రెండ్ గా చేసిన వ్యక్తి.. యంగ్ హీరోలకు సహజంగా అయితే బాబాయ్ గానో.. అంకుల్ గానో కనిపిస్తాడని అనుకుంటాం. సహజంగా సినిమా లెక్కలు ఇలాగే ఉంటాయ్. కానీ ట్యాలెంటెడ్ యాక్టర్ బ్రహ్మాజీ విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. ఇండస్ట్రీలో అందరితోనూ మాంచి ఫ్రెండ్లీగా ఉంటాడని.. మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తాడని బ్రహ్మాజీకి మంచి పేరుంది. సినిమాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది.

ప్రస్తుతం చాలా సినిమాల్లో బ్రహ్మాజీ హీరో ఫ్రెండ్ రోల్ లో కనిపించేస్తున్నాడు. ఆది నటించిన నెక్ట్స్ నువ్వే చిత్రం వచ్చే నెల విడుదల కానుండగా.. ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు బ్రహ్మాజీ. ఈ సినిమా ఓ హోటల్ బేస్డ్ గా సాగుతుందని.. తన పాత్ర బోలెడంత హాస్యం పంచుతుందని చెప్పాడు బ్రహ్మాజీ. అలాగే తన లైఫ్ లో తొలిసారిగా హారర్ కామెడీ చేస్తున్న సంగతి కూడా చెప్పాడు ఈ యాక్టర్. రీసెంట్ గా నాని మూవీ కృష్ణార్జున యుద్ధం కోసం ప్రేగ్ లో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఇందులో నాని స్నేహితుని పాత్రలో బ్రహ్మాజీ కనిపించనుండగా.. నిఖిల్ నటిస్తున్న సినిమాలో కూడా హీరో ఫ్రెండ్ రోల్ లోనే యాక్ట్ చేస్తుండడం విశేషం.

అసలు హైలైట్ ఏంటంటే.. గతంలో చిరంజీవి.. నాగార్జున.. వెంకటేష్ లకు కూడా ఫ్రెండ్ పాత్రలో బ్రహ్మాజీ నటించాడు. ఆ తర్వాత మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్ వంటి హీరోల పక్కన కూడా అదే టైపు రోల్స్ చేసి.. ఇప్పటి యంగ్ స్టర్స్ కూ స్నేహితుని గానే ఉండడం హైలైట్. రామ్ చరణ్ మూవీ రంగస్థలంలో వీఏఓ పాత్రలో యాక్ట్ చేస్తున్న బ్రహ్మాజీ.. మహేష్ బాబు మూవీ భరత్ అను నేను చిత్రంలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
Tags:    
  • Brahmaji 
  • Next Nuvve Movie 
  • Telugu NEws 

Similar News

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

జోరు పెంచిన శృతిహాసన్!

2026-11-15 01:30 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

82 ఏళ్ల బామ్మతో స్టార్ హీరో కొడుకు ఎంగేజ్మెంట్.. వైరల్ వార్తలపై నిజమెంత?

2026-11-14 23:30 GMT

శ‌ర్వానంద్ భోగి నేప‌థ్య‌మిదేనా?

2026-11-14 22:30 GMT

కోట్ల ఆఫర్లయినా నో అంటున్న స్టార్ యాక్టర్!

2026-11-14 19:30 GMT

పిల్లల కలలకు రెక్కలిస్తున్న స్టార్ పేరెంట్స్!

2026-11-14 18:30 GMT

ఇఫీ-2026 వేడుకల్లో టాలీవుడ్ సౌండే లేదు!

2026-11-14 17:45 GMT

పీసీ, శృతి, జాన్వీ, శిల్ప, అనుష్క.. ఔను అయింది!

2026-11-14 17:30 GMT

పవన్‌తో మరో సినిమా.. దిల్ రాజు ప్రయత్నాలు ఫలిస్తాయా?

2026-11-14 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS