బాల‌య్య‌తో బోయ‌పాటి పాలిటిక్స్‌!?

Update: 2018-08-03 04:09 GMT
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్ అంటే ఉండే క్రేజే వేరు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల్ని బాల‌య్య‌కు అందించారు బోయ‌పాటి. అందుకే ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో మ‌రో సినిమా వ‌స్తే చూడాల‌న్న‌ది నంద‌మూరి అభిమానుల ఆశ‌. అయితే బాల‌కృష్ణ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌న కెరీర్‌ లోనే మైలురాయిగా నిలిచిపోవాల‌ని బాల‌య్య‌ క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నారు. క‌థ త‌యారు చేయ‌డం నుంచి ప్ర‌తి విష‌యంలోనూ హీరో కం నిర్మాత‌గా ఆయ‌న ఎంతో కేర్ తీసుకుంటున్నారు. అందుకే బోయ‌పాటి సినిమా గురించి ఆలోచించే టైమ్ లేదు.

అయితే బోయ‌పాటి మాత్రం త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు. ఎన్టీఆర్‌ బ‌యోపిక్ త‌ర్వాత బాల‌య్య త‌న‌తో మాత్ర‌మే సినిమా చేయాల‌న్న పంతం చూపిస్తున్నాడు. అంతేనా బాల‌య్య బాబు ఇమేజ్‌ కి త‌గ్గ స్క్రిప్టుని త‌యారు చేస్తున్నాడు. సింహా పొలిటిక‌ల్ జ‌ర్నీకి హెల్ప్ అయ్యే పొలిటిక‌ల్ బ్యాక్‌ డ్రాప్‌ క‌థ‌పై ఎం.ర‌త్నంతో క‌లిసి సీరియ‌స్‌ గా  క‌స‌ర‌త్తు చేస్తున్నారట‌. ఇదో సెటైరిక‌ల్ పొలిటిక‌ల్ డ్రామా. 2019 మిడిల్‌ లో ప్రారంభం అవుతుంద‌ని తెలిసింది.

పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ అంటే బాల‌య్య శైలిలో పంచ్ డైలాగుల‌కు ఆస్కారం ఎక్కువే ఉంటుంది. రాజ‌కీయాలు కాబ‌ట్టి బ్రూట‌ల్ ఫ్యాక్ష‌న్ యాక్ష‌న్‌ కి ఆస్కారం ఉంటుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అంటే మ‌రోసారి బాల‌య్య‌-బోయ‌పాటి బృందం మాస్‌కి మ‌సాలా వేసి ఫుల్ మీల్స్ అందించ‌బోతోంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రోవైపు బాల‌య్య కోసం మాంచి మాస్ మ‌సాలా స్క్రిప్టును రూపొందించే ప‌నిలో మెగా డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్ బిజీబిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News