బాక్సాఫీస్: వీకెండ్ సెలవులు కలిసి రాలేదు
ఈ వారంతంలో రిలీజైన వైల్డ్ డాగ్ సహా మరో నాలుగు సినిమాల బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంది? అన్నది ట్రేడ్ లో ఆరా తీస్తే తెలిసిన సంగతులు నిశ్చేష్ఠులనే చేశాయి.గుడ్ ఫ్రైడే వారాంతంలో వైల్డ్ డాగ్ - సుల్తాన్ (అనువాదం) అనే రెండు సినిమాలు క్రేజీగా వచ్చినా కానీ.. ఆశించిన స్థాయి వసూళ్లను సాధించలేదు. వీటికి పంపిణీ వర్గాలు భారీ మొత్తాల్ని పెట్టుబడిగా పెట్టారు. కానీ రెండో రోజు ఆదివారం వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవనేది ఓ నివేదిక. డే-వన్ సరైన ఓపెనింగ్ లేని సుల్తాన్ రెండవ రోజున పడిపోయింది. ఆదివారం చాలా తక్కువ బెటర్ మెంట్ కనిపించింది. తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం వీకెండ్ నాటికి పంపిణీదారు వాటా 2.60కోట్లు అని తెలిసింది. 7 కోట్లకు కొనుగోలు చేస్తే ఈ వసూళ్లు రావడం కష్టం. భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
డే-వన్ ఏమాత్రం ఓపెనింగులు లేకపోయినా.. వైల్డ్ డాగ్ కి మంచి టాక్ వచ్చింది. క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. అయినా కానీ అదేదీ ఈ సినిమాకి కలిసొచ్చినట్టు కనిపించలేదు. ఈ చిత్రం రెండవ రోజు వసూళ్లు పడిపోగా ఆదివారం అంతంత మాత్రమే. మొదటి వారాంతంలో తెలుగు రాష్ట్రాల నుంచి 2.15 కోట్లు వసూలు చేస్తోందని సమాచారం. 9 కోట్లు పైగానే ఈ సినిమా వసూలు చేస్తేనే సేఫ్ అని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
ఇక ఇతర సినిమాల్లో రంగ్ దే కొంతవరకూ ఫర్వాలేదనిపించినా కానీ రెండో వారాంతంలో కోటి కంటే తక్కువే వసూలు చేసింది. తెలుగు స్టేట్స్‌లో ఈ చిత్రం 10 రోజులకు ఆశించినంత పెద్ద మొత్తాన్ని వసూలు చేయడంలో విఫలమైంది. పెద్ద నష్టం తప్పదని అంచనా. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ తెలుగు రాష్ట్రాల్లో మంచి వ్యాపారం చేసింది. బాక్సాఫీస్ వద్ద సేఫ్ ప్రాజెక్ట్ అని ప్రచారమవుతోంది.