• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాస్ వ‌చ్చే శాడు..డిజే...

బాస్ వ‌చ్చే శాడు..డిజే వీర‌య్య..మాస్ స్టెప్పుల‌తో అదురుద్ది పార్టీ!

By - Tupaki Desk
Update: 2022-11-23 11:16 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'వాల్తేరు వీర‌య్య‌'. ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేస్తుందా? అని అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో చిరుకు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తోంది.  టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా త‌న‌కు జోడీగా కేథ‌రిన్ న‌టిస్తోంది.

ఈ మూవీలో చిరు, ర‌వితేజ స‌వ‌తి త‌ల్లి సోద‌రులుగా క‌నిపించ‌బోతున్నారు. చాలా ఏళ్ల విరామం త‌రువాత చిరుతో క‌లిసి ర‌వితేజ  న‌టిస్తున్న సినిమా కావ‌డం, ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీర్ గా అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌టంతో సినిమా ఓ రేంజ్ లో వుండే అవ‌కాశం వుంది. ఈ మూవీపై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకుంటున్నారు. 2023 సంక్రాంతి బ‌రిలో పోటీకి దిగుతున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

సినిమా రిలీజ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర బృందం లిరిక‌ల్ వీడియోల‌తో ప్ర‌చార ప‌ర్వానికి తెర‌లేపింది. దేవి శ్రీ‌ప్ర‌సాద్ అ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. బాస్ నుంచి భారీ మాసీవ్ సాంగ్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్న అభిమానులని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ కోసం 'బాస్ పార్టీ..' అంటూ సాగే మాసీవ్ పార్టీ ఐట‌మ్ సాంగ్ కు స్వ‌రాలు అందించ‌డ‌మే కాకుండా దేవిశ్రీ‌ప్ర‌సాద్ సాహిత్యాన్ని అందించాడు. ఈ లిరిక‌ల్ వీడియోని బుధ‌వారం విడుద‌ల చేశారు.

ఈ పాట‌లో చిరుతో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా ..డ్యాన్స‌ర్స్ పాల్గొన‌గా ఈ పాట‌ని డ్యాన్స్ మాస్ట‌ర్ వీజే శేఖ‌ర్ చిత్రీక‌రించాడు. మెగాస్టార్ సిల్కు చొక్కా, గల్ల లుంగీ ధ‌రించి ఈ పాట‌లో మాసీవ్ స్టెప్పుల‌తో అద‌గొట్టెస్తున్నాడు. 'క్ల‌బ్బుల్లోనా పార్టీ అంటే శ‌ర శ‌రా మామూలే... హౌస్ పార్టీ అంటే కొత్త‌గా వుండ‌దు ఏ మూలే... బీచ్ పార్టీ అంటే అస‌లు రీచ్ పెద్ద‌గా వుండ‌దులే.. నా బోటే ఎక్కు డీజే నొక్కు ప‌గులుద్ది పార్టీ.. అంటూ సాగే ఈ పాట‌కు సంగీతం, సాహిత్యం దేవిశ్రీ ప్ర‌సాద్ అందించ‌గా, దేవితో కలిసి న‌కాష్ అజీజ్‌, హ‌రి ప్రియ ఆల‌పించారు.  

థియేట‌ర్ల‌లో ఈ పాట ఫ్యాన్స్ చేత మాస్ డ్యాన్స్ చేయించేలా వుంది. దేవీ బీట్ , ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ వేసిన క‌ల‌ర్ ఫుల్ పార్టీ సెట్, చిరు మాసీవ్ స్టెప్స్‌, ఊర్వ‌శీ రౌతేలా గ్లామ‌ర్‌ ఈ పాట‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి.

చిరు ఈ పాట‌లో త‌న గెట‌ప్ తో 'ముఠామేస్త్రీ' నాటి రోజుల్ని గుర్తు చేశాడు. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్ అంటూ 'బాస్ పార్టీ' లిరిక‌ల్ వీడియోలో ప్ర‌చార ప‌ర్వానికి తెర లేపీని వీర‌య్య సంక్రాంతి బ‌రిలో ఏ స్థాయిలో సంద‌డి చేయ‌బోతున్నాడో వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View


Tags:    
  • BossParty 
  • WaltheruVeeraya 
  • LyricalSong 
  • MegaStarChiranjeevi 
  • DSP 
  • Bobby 
  • UrvashiRautela 
  • NakazAziz 
  • HariPriya 
  • ShrutiHassan 
  • CatherineTresa 
  • MovieNews 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS