• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'పూజ హెగ్డే పాత్రకి ఆ...

'పూజ హెగ్డే పాత్రకి ఆ పేరు పెట్టడం వెనుక ఒక సీక్రెట్ ఉంది: 'బొమ్మరిల్లు' భాస్కర్

By - Tupaki Desk
Update: 2021-10-09 04:30 GMT
లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను తెరపై సహజంగా ఆవిష్కరించే దర్శకులలో 'బొమ్మరిల్లు' భాస్కర్ ఒకరు. 'బొమ్మరిల్లు'  తరువాత ఆయన సినిమాలు చేసినప్పటికీ, ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు. కొంత గ్యాప్ తరువాత ఆయన ఇప్పుడు  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా చేశాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. " ఈ సినిమా అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో మొదలైంది. షూటింగ్ అంతా కూడా సాఫీగా సాగిపోయింది. ఈ రోజున ఈ సినిమా ఫంక్షన్ కి చైతూ రావడం చాలా హ్యాపీగా ఉంది.

అఖిల్ వెనుక అక్కినేని అభిమానులు ఎప్పుడూ ఉంటారు. అఖిల్ ను తెలుగు ప్రేక్షకులందరి దగ్గరికి తీసుకువెళ్లాలని ఉద్దేశంతోనే నేను వచ్చాను. ఆయనను అందరికీ మరింత దగ్గర చేయాలనేదే నా ప్రయత్నం. అది ఈ సినిమాతో కచ్చితంగా జరుగుతుంది. అఖిల్ ను మీరు ఒక కొత్త కోణంలో చూసి డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఇక పూజ హెగ్డే విషయానికి వస్తాను. ఆమె నటన చూసి మేమంతా సర్  ప్రైజ్ అయ్యాం .. అలాగే మీరు కూడా సర్ ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో మీరంతా కూడా ఒక కొత్త పూజను చూస్తారు.

ఈ సినిమాలో ఆమె 'విభా' అనే పాత్రను పోషించింది. ఆ పాత్ర పేరు వెనుక ఉన్న ఒక సీక్రెట్ కూడా ఇప్పుడు చెబుతాను. మా పెద్ద డాటర్ పేరు 'హాసిని' .. మా రెండో అమ్మాయి పేరు 'విభా'. పూజ పాత్రకి చాలా ధైర్యంగా నా కూతురు పేరు పెట్టాను. ఈ లోకం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ ను తయారు చేస్తూనే ఉంది. ఈ ప్రయాణంలో ఒక విషయాన్ని మన పేరెంట్స్ మనకి నేర్పలేదు. మనం మన పిల్లలకు నేర్పడం లేదు .. అదేమిటో చెప్పే ఒక ఆసక్తికరమైన ప్రయత్నమే ఈ కథ. అది అందరికీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను.

 ఈ కథ విన్న సిరివెన్నెల సీతారామశాస్త్రికి గారు ఒక మాట అన్నారు. "ఈ కథను నువ్వు కోపంలో రాశావయ్యా. లోకానికి ఎదురెళ్లి ఒక ప్రశ్న అడుగుతున్నావు. కానీ ఆ ప్రశ్న అడగడంలోను  ప్రేమ ఉంది" అన్నారు. ఆ ప్రేమ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా డైరెక్షన్ డిపార్టుమెంటువారు నాతో రెండేళ్లపాటు ట్రావెల్ చేశారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి వాళ్లంతా చాలా కష్టపడ్డారు. అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్న్నాను" అని చెప్పుకొచ్చాడు.
Tags:    
  • Akhil Akkineni 
  • Bommarillu Baskar 
  • Pooja Hegde 
  • Naga Chaitanya 
  • Most Eligible Bachelor 
  • Most Eligible Bachelor release date 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS