రెండో లాక్ డౌన్ కు సీఎం రెడీ ఆందోళనలో బాలీవుడ్
కరోనా సెకండ్ వేవ్ టెన్షన్స్ ఉత్తరాదిన తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా ముంబై - మహారాష్ట్రలో రోజురోజుకి పెరుగుతున్న కేసులతో ప్రభుత్వంలో ఆందోళన నెలకొంది. దీంతో పాటే బాలీవుడ్ లో తీవ్ర టెన్షన్ వాతావరణం వేడెక్కిస్తోంది. ఇప్పటికే పలు భారీ చిత్రాల రిలీజ్ లపై సందేహాలు అలుముకున్నాయి.
సరిగ్గా ఇలాంటి సమయంలో పులిమీద పుట్రలా రెండో లాక్ డౌన్ కి సిద్ధం కండి అంటూ సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రకటనతో సినీప్రముఖుల గుండెలదిరాయి. COVID-19 కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పరిస్థితిని బట్టి ప్రతిఒక్కరూ సిద్ధం కండి. లాక్ డౌన్ అయ్యే అవకాశం ఉందని సిఎం ఉద్ధవ్ థాకరీ హెచ్చరించారు. దీంతో టెన్షన్ కి గురైన పరిశ్రమ సత్వరం ముఖ్యమంత్రిని అభ్యర్థించేందుకు రెడీ అవుతోంది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సంఘం బరిలో దిగి సీఎంని సముదాయించే పనిలో పడింది. వినోద పరిశ్రమ స్థితిని వివరిస్తూ సీఎంకు ఒక లేఖను రూపొందించింది.
ఇంతకీ ఈ లేఖలో ఏం ఉంది? అంటే.. వినోద పరిశ్రమను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున మరొక లాక్ డౌన్ విధించవద్దని FWICE ముఖ్యమంత్రిని అభ్యర్థించింది. మొదటి లాక్ డౌన్ వల్ల జరిగిన నష్టాల నుండి పరిశ్రమ ఇంకా కోలుకోలేదని రెండవ లాక్ డౌన్ తో పరిస్థితి మరింత దిగజారిపోతుందని లేఖలో పేర్కొన్నారు.
FWICE ప్రధాన సలహాదారు అశోక్ పండిట్ తన ట్విట్టర్ పేజీ లో ఆ లేఖ కాపీని పంచుకున్నారు. పూర్తి లాక్ డౌన్ విధించవద్దని గౌరవనీయ సీఎంజీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది పరిశ్రమలో భయాందోళనలను సృష్టిస్తుంది. ఇప్పటికే గందరగోళంలో ఉన్నాం. ఎగ్జిబిటర్లు పూర్తి జాగ్రత్తలు తీసుకునేలా మేము ప్రభుత్వానికి భరోసా ఇస్తున్నాం. మార్గదర్శకాలు అనుసరిస్తాం.. అని లేఖలో పేర్కొన్నారు.
ఒక సంవత్సరం మొత్తం పని ఆదాయం పోవడంతో ..ఆహారం లేక ఆకలితో బాధపడుతున్న కుటుంబాలున్నాయి. అణగారిన పిల్లల ఆకలి పేదరికం యుద్ధాలతో పోరాడుతున్నారు. ఒంటరిగా మిగిలిపోయిన ప్రజల చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఏ ప్రభుత్వ సంస్థ నుండి (రాష్ట్రం లేదా సెంట్రల్ కాదు) ఎటువంటి సహాయం లేకుండా మీడియా- వినోద పరిశ్రమ రోజువారీ వేతన సంపాదకుల రక్షణకు కలిసివచ్చిన నిర్మాతలు అగ్ర నటులు.. నటీమణుల సంఘం వారు రోజువారీ రొట్టెలను అందించడానికి పెద్ద మొత్తంలో సహకరించారు. ఇప్పుడు మా సోదరులకు సహాయం చేసిన నిర్మాతలు.. నటులు.. నటీమణుల సంఘాలు ఈ రోజువారీ వేతన కార్మికులకు సాంకేతిక నిపుణులకు ఎటువంటి సహాయం అందించే స్థితిలో లేనందున పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు``అని లేఖలో పేర్కొంది. పరిశ్రమలో మేము అన్ని నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటామని మీకు హామీ ఇస్తున్నాము అని లేఖలో పేర్కొనడం విశేషం.