• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ కి మళ్లీ...

టాలీవుడ్ కి మళ్లీ బాలీవుడ్ భామలు

By - Tupaki Desk
Update: 2018-05-14 06:33 GMT
సౌత్ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్స్ అస్సలు ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. ముఖ్యంగా తెలుగులో అయితే ఆఫర్స్ వచ్చినా కూడా పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు అలా లేవు. చాన్స్ వస్తే రెమ్యునరేషన్ తో సంబంధం లేకుండా ఒప్పేసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో సినిమాలో కంటెంట్ ని బట్టి ఒప్పుకోవడానికి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మంచి హిట్ అందితే అన్ని వైపులా లాభం ఉంటుంది. పైగా తెలుగోళ్ల వీళ్లకు కోట్లలో చదివించుకుంటున్నారాయే.

ప్రస్తుతం నార్త్ భామల ఆలోచన అలానే ఉంది. మెయిన్ గా టాలీవుడ్ స్టార్ హీరోలంటే వెంటనే ఒప్పేసుకుంటున్నారు. ఇటీవల భరత్ అనే నేను సినిమాతో కైరా అద్వానీ మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ రామ్ చరణ్ తో కూడా ఆ బ్యూటీ అవకాశం అందుకుంది. ఇక నెక్స్ట్ నిధి అగర్వాల్ కూడా వరుసగా ఆఫర్స్ అందుకుంటూ బిజీ అవ్వడానికి ట్రై చేస్తోంది. నెక్స్ట్ అఖిల్ తో కూడా ఓ సినిమా కోసం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య సవ్యాసాచి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా సాహో లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తోంది. రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటూ తెలుగు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ప్రభాస్ కూడా ఆమెకు స్పెషల్ కోచింగ్ ఇచ్చేస్తున్నారు. ఈ బ్యూటీకి కూడా మరికొన్ని అవకాశాలు అందే చాన్స్ ఉన్నట్లు టాక్.

ఒకప్పుడు సిమ్రాన్ నుండి భూమిక వరకు.. ఆర్తి అగర్వాల్ నుండి గజాలా వరకు.. అన్నీముంబయ్ సరుకులే. బాలీవుడ్ సొగసులే. హీందీ వాసనలే. ఆ తరువాత ట్రెండ్ మారి.. తమిళ్ అండ్ మల్లూ బ్యూటీస్ కాస్త పెత్తనం చలాయించారు. ఇప్పుడు మరోసారి ముంబయ్ భామలు సత్తా చాటుతున్నారు. వీరి రాకతో ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గుతాయని చెప్పాలి. మరి వీరిలాగానే ఇంకెంతమంది ఎంట్రీ ఇస్తారో చూడాలి.




Tags:    
  • Bollywood Heroines 
  • Telugu Film Industry 

Similar News

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

Copyright @2026

Powered by Blink CMS