• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోకస్‌: బాలీవుడ్ సూపర్...

ఫోకస్‌: బాలీవుడ్ సూపర్ హిట్ లవ్ స్టోరీలు

By - Tupaki Desk
Update: 2016-02-14 17:30 GMT
బాలీవుడ్ లో లవ్ స్టోరీలు చాలా క్యూట్ గా ఉంటాయి. ఆ ప్రేమ ఫీలింగ్ ని చాలా రసవత్తరంగా తెరకెక్కించడంలో హిందీ సినిమాలు చాలా అడుగులు ముందే ఉంటాయి. ఇప్పుడున్న టాప్ స్టార్లుగా ఉన్న హీరోలందరూ లవ్ స్టోరీలతో టాప్ రేంజ్ కి చేరినవారే. అంతేకాదు.. వీళ్లలో కొంతమందికి రియల్ గానే ప్రేమలున్నాయి. వాటిని పండించుకుని తమ జీవితాన్ని మధురంగా మార్చుకున్నారు.

ముందుగా బాలీవుడ్ లో రొమాంటిక్ బాద్ షా షారూక్ ఖాన్ సంగతి చూస్తే.. 18 ఏళ్ల వయసులోనే.. ఓ వేడుకలో డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిని చూసి ఇష్టపడి - ధైర్యంగా తనతో డ్యాన్స్ చేయాలని అడిగాడు. తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకోమని అడిగాడు. తనే గౌరీ ఖాన్. మా ఆయన మంచి భర్తే కాదు.. మంచి స్నేహితుడు అంటుంది గౌరి.

లగాన్ షూటింగ్ సమయంలో అమీర్ ఖాన్ ను చూసింది కిరణ్ రావ్. దిల్ చాహతా హై టైంలో మళ్లీ కలుసుకున్నారు. అప్పటికే విడాకుల కారణంగా ఒంటరితనంతో ఫీల్ అవుతున్న అమీర్ - కిరణ్ రావులు ప్రేమలో పడ్డారు. అమీర్ గురించి చెప్పాలంటే.. అలాంటి జీవిత భాగస్వామి ఎవరికీ దొరకరు అని కిరణ్ రావు చెబుతూ ఉంటుంది.

తషాన్ షూటింగ్ టైంలో కలుసుకున్న సైఫ్ ఆలీ ఖాన్ - కరీనా కపూర్ లు... ఆ మూవీ పూర్తయ్యేసరికి ప్రేమలో పడిపోయారు. తన చేతిపై కరీనా పేరును టాటూ వేసుకుని ప్రేమని తెలియచెప్పాడు సైఫ్. అప్పటికే భార్యతో విడిపోయిన సైఫ్, షాహిద్ తో లవ్ ఫెయిల్యూర్ లో ఉన్న కరీనాలు తేలిగ్గా కలిసిపోయారు. కరీనా నా ఇంటి దేవత అని చెబుతాడు సైఫ్.

కజరారే అంటూ ఐశ్వర్యారాయ్ ఆడిన పాట ఎవరూ మర్చిపోలేరు. ఈ సాంగ్  తీసేటపుడు ఐష్ పై మనసుపడ్డాడు అభిషేక్ బచ్చన్. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ.. ఓ డైమండ్ లాంటి డమ్మీ రింగ్ తెచ్చి, మోకాళ్లపై కూర్చుని సినిమాటిక్ గానే అడిగాట. అయితే రింగ్ డమ్మీ అయినా, లవ్ డమ్మీ కాదని అర్ధం చేసుకుని ఓకే చెప్పేసింది ఐష్. అభిషేక్ కంటే బెస్ట్ ఫ్రెండ్ నాకు ప్రపంచంలో ఎవరూ లేరు అంటుంది ఐశ్వర్యారాయ్ బచ్చన్.

కాజోల్ వేరే అబ్బాయితో డేటింగ్ లో ఉన్న టైంలో అజయ్ దేవగన్ తో పరిచయం అయింది. ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్న సమయంలో సలహాలు అడిగేదట కాజోల్. మెల్లగా సలహాలతో పాటు అజయ్ కూడా నచ్చేసి ఐలవ్యూ చెప్పేసిందట. భార్యాభర్తల్లో ఎవరు హ్యాపీగా ఉండాలన్నా.. ఇంకొకరు కూడా సంతోషంగా ఉండాల్సిందే అంటాడు అజయ్.

మేగజైన్ ఫోటో షూట్ లో అక్షయ్ కుమార్ - ట్వింకిల్ ఖన్నాలకు పరిచయం అయింది. ఇద్దరూ కలిసి ఇంటర్నేషనల్ ఖిలాడీ చేస్తున్న సమయంలో లవ్ ని ఎక్స్ ప్రెస్ చేసుకున్నారు. తను నటిస్తున్న మేలా హిట్ అయితే సినిమాలు చేసుకుంటానని, ఫ్లాప్ అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పిందట ట్వింకిల్. చివరకు సినిమా ఫ్లాప్, లవ్ స్టోరీ హిట్ అయింది. పెళ్లైన పదిహేనేళ్లు దాటినా ఇంకా నా చూపు తనపైనే ఉంది అని చెబుతాడు అక్షయ్.
Tags:    
  • Bollywood Celebs 
  • Real love Stories 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS