• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మన ఉమామహేశ్వరకు బాలీవుడ్‌...

మన ఉమామహేశ్వరకు బాలీవుడ్‌ పిలుపు

By - Tupaki Desk
Update: 2021-05-29 07:38 GMT
ట్యాలెంటెడ్‌ హీరో కమ్‌ యాక్టర్ సత్యదేవ్‌ వరుస చిత్రాలతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లాక్ డౌన్ టైమ్‌ లో అత్యధిక సినిమాలను విడుదల చేసిన హీరోగా రికార్డును దక్కించుకున్న సత్యదేవ్‌ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాలు ఒకొక్కటి చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఈ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌ కు బాలీవుడ్‌ నుండి పిలుపు వచ్చింది. బాలీవుడ్ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ రామ్‌ సేతు లో సత్యదేవ్‌ కు ఆఫర్‌ దక్కింది.

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఆదిపురుష్‌ సినిమాకు గట్టి పోటీ అన్నట్లుగా రామాయణ ఇతివృత్తం నేపథ్యంలో రూపొందుతున్న రామ్‌ సేతు సినిమా చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా సినిమా లో అక్షయ్ కుమార్ తో పాటు బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాను సౌత్ లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు కనుక సౌత్‌ స్టార్స్ ను కూడా పార్ట్‌ చేస్తున్నారు.

తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకుల్లో కూడా సత్యదేవ్‌ కు గుర్తింపు ఉంది. కనుక సత్యదేవ్‌ ను రామ్‌ సేతు సినిమా లో పార్ట్‌ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. పలు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా బాలీవుడ్‌ నుండి వచ్చిన బంపర్ ఆఫర్‌ అవ్వడంతో మన ఉమామహేశ్వర వెంటనే ఓకే చెప్పేశాడు. ఇటీవల మన స్టార్స్ పలువురు పాన్‌ ఇండియా స్టార్స్ గా గుర్తింపు దక్కించుకుంటున్నారు. సత్యదేవ్‌ కూడా రామ్ సేతు తో పాన్ ఇండియా స్టార్‌ గా మారిపోతాడేమో చూడాలి.
Tags:    
  • satya dev 
  • satya dev movies 
  • satya dev latest movies 
  • satya dev bollywood offer 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS