• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'క్వారంటైన్'లోకి తెలుగు...

'క్వారంటైన్'లోకి తెలుగు హీరోయిన్..

By - Tupaki Desk
Update: 2020-06-01 09:10 GMT
ఈ మధ్య సామాన్య జనాలతో పాటు సినీ తారలు కూడా క్వారంటైన్ లోకి వెళ్లక తప్పట్లేదు. తెలుగు ఇండస్ట్రీలోకి ఆవకాయ బిర్యాని సినిమాతో అరంగేట్రం చేసిన తెలుగమ్మాయి బిందుమాధవి. చక్కనైన కట్టు బొట్టుతో మొదటి సినిమాలో మెప్పించినప్పటికీ పెద్దగా అవకాశాలు అందుకోలేక పోయింది. తెలుగులో అడపాదడపా కన్పించింది బిందు కానీ తన కెరీర్ లో ఇంతవరకు సరైన బ్రేక్ దొరకలేదు. ఆ తర్వాత ఈ తెలుగు బ్యూటీ తమిళ సినిమాల అవకాశాలతో బిజీ అయిపోయింది. చాలాకాలం తర్వాత సోషల్ మీడియాలో కనిపించి తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. తెలుగులో బంపర్ ఆఫర్, ఓం శాంతి, రామ రామ కృష్ణ కృష్ణలాంటి సినిమాల్లో అటు గ్లామర్ తోను ఇటు నటనతోను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బిందు  తెలుగులో కనిపించిన చివరి సినిమా పిల్లా జమిందార్. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన బిందు మాధవి ఇకనైనా కెరీర్ ని చక్కదిద్దుకుందాం.. అనే ఆలోచనలో ఉందట. ఇక సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. తెలుగులో ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు తన వద్ద సమాధానం లేదని చెప్పింది. ఇక ప్రస్తుతం తను అధికారుల సూచన మేరకు క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపింది. ఎందుకంటే తను ఉంటున్న అపార్ట్మెంట్ లో ఒకరికి ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తిని ఐసోలేషన్ కి తరలించారట. ఇక ఎందుకైనా మంచిదని అపార్ట్మెంట్ లో ఉంటున్న అందరిని 14 రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారట. దీంతో ప్రస్తుతం తాను క్వారంటైన్ లో ఉన్నట్లు బిందు మాధవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. చివరగా తమిళంలో పక్కా, కజగు 2 సినిమాలలో కనిపించిన అమ్మడు ప్రస్తుతం మరో రెండు తమిళ సినిమాలతో బిజీగా గడుపుతుందట.
Tags:    
  • Bindu Madhavi 
  • Telugu Actress Bindu Madhavi 
  • Tollywood 
  • Kollywood 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS