• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నందమూరి హీరో సినిమాకు...

నందమూరి హీరో సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్స్..!

By - Tupaki Desk
Update: 2021-12-04 00:30 GMT
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''బింబిసార''. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది దీనికి ట్యాగ్ లైన్. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ మూవీ కథాంశంతో కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ఠ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఇదే క్రమంలో ఇటీవల రిలీజ్ చేయబడిన 'బింబిసార' టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇందులో కళ్యాణ్ రామ్ ను రెండు పవర్ ఫుల్ పాత్రల్లో ప్రెజెంట్ చేశారు. త్రిగర్తల సామ్రాజ్యపు నెత్తుటి సంతకం.. బింబిసారుడి ఏకచక్రాధిపత్యం అంటూ క్రూరమైన బార్బేరియన్ కింగ్ గా నందమూరి హీరోని చూపించారు. అలానే మోడరన్ లుక్ లో ఉన్న మరో పాత్రను పరిచయం చేసారు.

ఇది ఆధునిక చారిత్రక యుగాలకు సంబంధించిన టైం ట్రావెల్ కథని 'బింబిసార' ట్రైలర్ హింట్ ఇచ్చింది. భారీ బడ్జెట్ తో అత్యున్నత టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని అర్థం అయింది. అయితే టీజ‌ర్ చేసిన మ్యాజిక్ తో కళ్యాణ్ రామ్ సినిమాకి భారీగా బిజినెస్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయని తెలుస్తోంది.

'బింబిసార' చిత్రానికి ఫ్యాన్సీ రేట్ల‌తో ఓటీటీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయట. అయితే ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ థియేట‌ర్లోనే విడుద‌ల చేయాలని క‌ళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడట. 'ఎంత మంచివాడవురా' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేసిన ఈ సినిమాపై నందమూరి హీరో నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ భారీ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

'బింబిసార' చిత్రాన్ని కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్ పై కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇది హీరో కెరీర్లోనే పెద్ద సినిమా. ఇందులో కేథరీన్‌ ట్రెసా - సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తుండగా.. సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.
Tags:    
  • Bimbisara 
  • Nandamuri Kalyan Ram 
  • Nandamuri arts 
  • Nandamuri Kalyan Ram movies 
  • pataas 
  • Samyuktha Menon 
  • Catherine Tresa 

Similar News

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

Copyright @2026

Powered by Blink CMS