మోడల్ గా రాని గుర్తింపు.. బిగ్ బాస్ పుకారుతో అందరి కంట్లో పడింది
'బిగ్ బాస్' ప్రోగ్రాం మీద ఉన్న విమర్శలు అన్నిఇన్నికావు. అయితే.. విచిత్రమైన విషయం ఏమంటే.. ఈ షోను దారుణంగా తిట్టిపోసే వారు సైతం.. ఈ షోను ఫాలో అవుతుంటారు. అదే బిగ్ బాస్ మేజిక్. కాన్సెప్టు నాట్ ఓకే అయినా.. టీవీలో ఈ షో వస్తుంటే.. రిమోట్ ను పక్కన పెట్టేసి చూస్తుండిపోతారు. అందుకే.. ఈ రియాల్టీ షో.. భాషలో అయినా.. ఏ ప్రాంతంలో అయినా సరే సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకుంటుంది.
తాజాగా ఒక మోడల్ కమ్ షార్ట్ ఫిలిం నటికి కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. కొంతకాలంగా గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికి రాని పేరు.. ఒక పుకారు ఆమెను అందరి కంట్లో పడేలా చేసిందని చెబుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె మీద వచ్చిన పుకారు ఏమిటి? అందులో నిజం ఎంత? అన్నది చూస్తే.. బిగ్ బాస్ షో నడుస్తున్న వేళ.. వైల్డ్ కార్డు ఎంట్రీతో కొందరిని ఇంటి లోపలకుపంపటం.. అప్పటివరకు ఆటను బయట నుంచి చూసిన వారికి.. ఎలా ఆడాలన్న అవగాహన ఉంటుంది. మిగిలిన కంటెస్టెంట్ల కంటే పెద్ద ఎత్తున బజ్ తో వైల్డ్ కార్డు ఎంట్రీ.. కచ్ఛితంగా వారికి సాయం చేస్తుంది.
గత సీజన్లలో పలువురు వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చినోళ్లు ఎంతలా చెలరేగిపోయారో తెలిసిందే. తాజాగా రన్ అవుతున్న బిగ్ బాస్ సిరీస్ లో 19 మంది భారీ జట్టును బిగ్ బాస్ హౌస్ లోకి పంపిన నేపథ్యంలో.. కొత్తగా వైల్డ్ కార్డు ఎంట్రీ అవసరం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. అలాంటిదేమీ లేదని.. ఈసారీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుదని చెబుతూ.. కొందరి పేర్లను తెర మీదకు తీసుకొచ్చారు. అలా వచ్చిన వారిలో యాంకర్ వర్షిణి.. విష్ణుప్రియ ఉందన్న మాట వినిపించినా.. అలాంటిదేమీ లేదని తేల్చారు.
తాజాగా మోడల్ కమ్ షార్ట్ ఫిలిం స్టార్ ప్రీతి అన్షు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లుగా పుకారు మొదలైంది. దీంతో.. ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె ఇప్పటివరకు ఏం చేస్తుంటారు? లాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం నెటిజన్లు వెతుకుతున్నారు. దీంతో ఆమె ప్రొఫైల్ పాపులర్ అయ్యింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ప్రీతి అన్షుకు లేదని తేల్చేశారు. కానీ.. ఈ పుకారు ఆమె.. అందరికి తెలిసేలా చేసిందని చెబుతున్నారు. వత్రం చెడినా.. ఫలితమైతే వచ్చిందిగా? అది సరిపోతుందేమో?