• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్‌బాస్5 లీక్ : ఈ వారం...

బిగ్‌బాస్5 లీక్ : ఈ వారం ఎలిమినేషన్‌ ఎవరంటే..!

By - Tupaki Desk
Update: 2021-11-13 16:30 GMT
తెలుగు బిగ్ బాస్ సీజన్‌ 5 నుండి మరో కంటెస్టెంట్‌ బయటకు వచ్చేశాడు. ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారు కాజల్‌.. మానస్.. సన్నీ.. సిరి మరియు రవి. వీరిలో కాజల్ లేదా మానస్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చివరి నిమిషం వరకు అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా జెస్సీ కి ఆరోగ్యం బాగుండని కారణంగా ఎలిమినేట్ చేసి బయటకు పంపించే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే కాజల్ లేదా మానస్ ఈ వారంకు సేవ్‌ అయ్యారు. జెస్సీని స్టేజ్ పైకి తీసుకు వచ్చి ఇంటి సభ్యులకు గుడ్ బై చెప్పించినట్లుగా లీక్ అందుతోంది. శనివారం ఎపిసోడ్ లో ఆ విషయం రివీల్‌ చేయడం లేదు. ఆదివారం ఎపిసోడ్‌ లో అసలు విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సీజన్ ప్రారంభం అయిన సమయంలో జెస్సీ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కాని షన్నూ మరియు సిరిలతో స్నేహం అతడికి కలిసి వచ్చింది. త్రిమూర్తులు అంటూ వారు ముగ్గురిని ఇంటి సభ్యులు మరియు బయట పిలిచే వారు. ముగ్గురు కూడా మంచి స్నేహంతో కొనసాగారు. అలాంటి స్నేహం బ్రేక్ అవ్వబోతుంది. బిగ్ బాస్ సీజన్‌ 5 నుండి ప్రేక్షకుల ఓట్ల ద్వారా కాకుండా అనారోగ్యంతో జెస్సీ బయటకు వెళ్లడం విచారం. జెస్సీకి మరో రెండు మూడు వారాల పాటు ఉండే అర్హత ఉందంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో అతడి ఆట తీరు చక్కగా మారింది. మొదట్లో కాస్త చిన్న పిల్లాడిగా వ్యవహరించిన జెస్సీ ఆటను అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డట్లుగా ఉండేవాడు. కాని ఇప్పుడు అలాంటి సమస్య లేదు.

అంతా బాగుందని అనుకుంటున్న సమయంలో అనారోగ్య సమస్యతో ఈ వారం ఆరంభంలోనే బయటకు వెళ్లాడు. అయితే అంతా బాగానే ఉంది మీరు రీ ఎంట్రీ ఇచ్చి హౌస్ లోకి వెళ్లవచ్చు అంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. ఆ సమయంలో వారం రోజులు సీక్రెట్ రూమ్‌ లో ఉండి జెస్సీ మళ్లీ హౌస్ లో అడుగు పెడతాడు అనుకుంటూ ఉండగా మళ్లీ అతడి ఆరోగ్యం చెడిపోవడంతో ఇక చేసేది లేక అతడి ఇష్ట ప్రకారం ఎలిమినేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై షన్ను మరియు సిరిలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. ఇతర సభ్యులకు కూడా ఈమద్య జెస్సీ బాగానే కనెక్ట్ అయ్యాడు. కనుక మంచి కంటెస్టెంట్ ను కోల్పోయాం అంటూ ప్రేక్షకులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Bigg Boss 5 
  • Jessie 
  • Nagarjuna 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS