• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలియాభ‌ట్ కి ప‌వ‌న్...

అలియాభ‌ట్ కి ప‌వ‌న్ క‌ల్యాణ్ దెబ్బ వేశాడుగా!

By - Tupaki Desk
Update: 2022-02-16 15:30 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న భారీ క్రేజీ మూవీ `భీమ్లా నాయ‌క్‌`. మాట‌ల మాంత్రికుడు మాట‌లు, స్క్రీన్ ప్లే స‌మ‌కూర్చ‌డ‌మే కాకుండా ర‌చ‌నా స‌హ‌కారం అందించ‌డంతో ఈ మూవీపై స‌హ‌జంగానే భారీ క్రేజ్ ఏర్ప‌డింది. `వ‌కీల్ సాబ్‌` త‌రువాత ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డం, తొలిసారి లుంగీ ధ‌రించి ఊర మాస్ పాత్ర‌లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా ప‌వ‌న్ న‌టించిన సినిమా కావ‌డంతో ఈ చిత్రం కోసం ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రియులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ రిలీజ్ విష‌యంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న మేక‌ర్స్ మంగ‌ళ‌వారం రాత్రి 9:30 గంట‌ల‌కు స‌డ‌న్ షాక్ ఇచ్చారు. `భీమ్లా నాయ‌క్` 25నే వ‌చ్చేస్తోందంటూ షాకింగ్ ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో మిగ‌తా చిత్రాల ప‌రిస్థితి అయోమ‌యంలో ప‌డిపోయింది. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన చిత్రాలు అదే రోజున రాక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో అలియా భ‌ట్ కి ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ స్థాయిలోనే దెబ్బ వేశాడ‌ని అప్పుడే చ‌ర్చ మొద‌లైంది.

వివ‌రాల్లోకి వెళితే.. ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన ఈ చిత్రం మార్చి 25న ఎట్ట‌కేల‌కే థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా సంద‌డి చేయ‌డానికి రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే.

ఈ పాన్ ఇండియా మూవీ ద్వారా బాలీవుడ్ క్రేజీ లేడీ అలియా భ‌ట్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. దీంతో ఆమెకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో అలియా భ‌ట్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన `గంగూబాయి క‌తియావాడీ` తెలుగులోనూ విడుద‌ల కాబోతోంది. అది కూడా `భీమ్లా నాయ‌క్` విడుద‌ల‌వుతున్న ఫిబ్ర‌వ‌రి 25నే కావ‌డం ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. తెలుగులో ప‌వ‌న్‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

ఆ క్రేజ్ కార‌ణంగా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధిక థియేట‌ర్ల‌లో `భీమ్లా నాయక్‌` హ‌వానే వుంటుంద‌న్న‌ది అంత‌రికి తెలిసిందే. అంతే కాకుండా `భీమ్లా నాయ‌క్‌` ని హిందీలోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు. తెలుగులోనే కాకుండా హిందీ వెర్ష‌న్ ప‌రంగానూ ప‌వ‌న్ .. అలియాకు గ‌ట్టి షాక్ ఇవ్వ‌బోతున్నార‌న్న‌మాట‌.

ఇలా రెండు చోట్లా అలియాకు ప‌వ‌న్ దెబ్బ కొడుతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ పోటీని సంజ‌య్ లీలా భ‌న్సాలీ క్రేజ్ తో అలియా ఎదుర్కుంటుందో లేక ప‌వ‌న్ ధాటికి చేతులెత్తేస్తుందో చూడాలి అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు.
Tags:    
  • bhemlanayak 
  • pawankalyan 
  • 25th 
  • release 
  • gangubai 
  • aliabhatt 
  • effects 
  • bollywood 
  • tollywood 
  • movienews 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS