• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'భీమ్లా నాయక్' మెలోడీ:...

'భీమ్లా నాయక్' మెలోడీ: అందరూ ఇష్టంగా వినేలా 'అంత ఇష్టం' పాట..!

By - Tupaki Desk
Update: 2021-10-15 07:11 GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్‌ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ''భీమ్లా నాయ‌క్''. మలయాళం సూపర్ హిట్‌ ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్‌. ఇందులో పవన్ భార్యగా నిత్యా మీనన్.. రానా కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుద‌లైన ఫస్ట్‌ లుక్ - ఇద్దరు హీరోల గ్లిమ్స్ - టైటిల్ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నేడు శుక్రవారం దసరా పండగ సందర్భంగా 'అంత ఇష్టం' అనే రెండో పాటను రిలీజ్ చేశారు.

గురువారం చిత్రం బృందం వదిలిన సాంగ్‌ ప్రోమో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా వచ్చిన ఫుల్ సాంగ్ వీక్షకులను అలరిస్తోంది. 'పేరెట్టి నిన్నెట్ట పిలిచేది తలిచేది.. నా ఇంటి పెనివిటివే.. బొట్టేట్టి ముద్దెట్టి నను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే.. నా బంగారి మావా.. నా బలశాలి మావా.. నా మెళ్లోని నల్ల పూసల్లో మణిపూసవే.. 'అంత ఇష్టం ఏందయా.. అంత ఇష్టం ఏందయ్యా నీకు నా మీద..' అంటూ సాగిన ఈ పాట పవన్ - నిత్యా మీనన్ ల మీద షూట్ చేయబడింది.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన తన భర్త భీమ్లా నాయక్ లోని ప్రేమ కోణాన్ని ఆయన భార్య ఈ పాట ద్వారా ఆవిష్కరించారు. ఇందులో పవన్ - నిత్యా జోడీ బాగుంది. వారికి ఒక బాబు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మెలోడీ గీతానికి ఎస్ ఎస్ థమన్ బాణీలు సమకూర్చారు. గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ప్రముఖ గాయని చిత్ర ఆలపించారు. 'అంత ఇష్టం' పాటను సినీ ప్రియులు ఇష్టంగా వింటున్నారు. అందుకే విడుదలైన కొన్ని గంటల్లోనే మంచి వ్యూస్ రాబట్టింది.

'భీమ్లా నాయక్' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే - మాటలు అందిస్తున్నారు. రవి కె చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Full View
Tags:    
  • Bheemla Nayak 
  • Latest news 
  • Movie news 
  • Antha Ishtam 
  • Lyrical song 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS