ఇళయరాజాపై భారతీరాజా షాకింగ్ కామెంట్స్!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాగానే ఆయనపై విమర్శల దాడి మొదలైన సంగతి తెలిసిందే. ఆయన స్థానికుడు కాదని, ఆయనకు తమిళ ప్రజల మద్దతుండదని ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా - భారతీరాజా.....ప్రముఖ సంగీత దర్శకుడు - పద్మవిభూషణ్ ఇళయరాజా పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఇళయరాజాకు పద్మభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనపై భారతీరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆయన దళితుడు కావడం వల్లనే ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందంటూ ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇళయరాజా బ్రాహ్మణుడు కావాలనుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ఇళయరాజా - భారతీరాజా ఒకే ఊరికి చెందినవారు. ఇద్దరూ దాదాపుగా ఒకేసారి సినీ రంగంలో అడుగుపెట్టి ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఈ లెజెండ్ లు ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయితే, వీరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. `ఇళయరాజా దళితుడు కావడం వల్లే అతడికి `పద్మవిభూషణ్` వచ్చింద`ని ఓ పత్రిక కథనం రాసింది. అది వివాదస్పదం కావడంతో క్షమాపణలు చెప్పింది. ఆ విషయంపై భారతీరాజా ఓ సభలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇళయరాజా దళితుడు కావడం వల్లే అవార్డు వచ్చిందని కొందరు అంటున్నారని, కానీ, ఇళయరాజా బ్రాహ్మణుడు కావాలని ప్రయత్నిస్తున్నాడని అన్నారు. అయితే, భారతీరాజా వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఘాటుగా స్పందించారు. `అయ్యర్ అంటే ఉపాధ్యాయుడు, గౌరవింపదగిన వాడు అని, ఆ రకంగా ఇళయరాజా ఇప్పటికే అయ్యర్ అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇళయరాజా స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.