• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గోవిందుడి కోసం మహేష్‌...

గోవిందుడి కోసం మహేష్‌ మూవీ రచయిత..!

By - Tupaki Desk
Update: 2018-09-14 08:34 GMT
‘అర్జున్‌ రెడ్డి’ - ‘గీత గోవిందం’ చిత్రాలతో ఒక్కసారిగా స్టార్‌ హీరోగా మారిపోయిన విజయ్‌ దేవరకొండ వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ‘గీత గోవిందం’ చిత్రం దాదాపుగా 70 కోట్ల షేర్‌ ను రాబట్టిన నేపథ్యంలో ఆయన స్టార్‌ డం ఏంటో తేలిపోయింది. కేవలం విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ తో అంతటి వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఈయనతో సినిమాకు దర్శకులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ‘నోటా’ మరియు ‘ట్యాక్సీవాల’ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉండగా, ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. ఈ సమయంలోనే మరో సినిమాకు విజయ్‌ ఓకే చెప్పాడు.

ట్యాలెంటెడ్‌ దర్శకురాలిగా గుర్తింపు దక్కించుకున్న నందిని రెడ్డి దర్శకత్వంలో విజయ్‌ ఒక చిత్రాన్ని చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తికాక ముందే నందిని రెడ్డి దర్శకత్వంలో మూవీని విజయ్‌ చేయబోతున్నాడు. ఈ చిత్రం కోసం ‘భరత్‌ అనే నేను’ చిత్రానికి స్క్రిప్ట్‌ అందించిన రచయిత శ్రీహరి నాను స్క్రిప్ట్‌ను అందించబోతున్నాడు. తకిట తకిట మరియు సత్యభామ చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీహరి నాను దర్శకుడిగా గుర్తింపు దక్కించుకోలేక పోయాడు. దాంతో రచయితగా సెటిల్‌ అయ్యాడు. పలు చిత్రాలకు స్క్రిప్ట్‌ రచనలో సహకారం అందించిన ఈయన భరత్‌ అనే నేను చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.

టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన శ్రీహరి నాను తాజాగా విజయ్‌ దేవరకొండ మూవీకి స్క్రిప్ట్‌ అందించబోతున్న నేపథ్యంలో అప్పుడే అంచనాలు పెరుగుతున్నాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ‘నోటా’ విడుదలైన తర్వాత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది చివర్లో విజయ్‌ దేవరకొండ - నందిని రెడ్డిల కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Tags:    
  • Bharat Ane Nenu scriptwriter 
  • Srihari Nanu 
  • Vijay Devarakonda 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS