• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని సినిమా ఆడియో ఆగస్టు...

నాని సినిమా ఆడియో ఆగస్టు 15న

By - Tupaki Desk
Update: 2015-08-06 11:06 GMT
‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన నాని.. మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కథానాయిక. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ జనాల్ని ఆకట్టుకుంది. మెమొరీ నిల్.. ఎంటర్టైన్మెంట్ ఫుల్ అనే క్యాప్షన్ చూసి.. ఈ సినిమా కాన్సెప్ట్ ఏమై ఉంటుందా అని ఆసక్తికర చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో. ఈ సినిమా ఆడియో డేటు కూడా ఫిక్సయింది. ఆగస్టు 15న హైదరాబాద్ లో భారీ స్థాయిలో వేడుక చేయడానికి ముహూర్తం కుదిరింది.

‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’తో టాలీవుడ్ కు పరిచయమైన నేషనల్ అవార్డ్ విన్నింగ్ మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్నందించడం విశేషం. ఈ సినిమా గురించి ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ.. ‘‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ జరుగుతోంది. గోపీసుందర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా ప్ర‌మోష‌న్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. డిఫ‌రెంట్ గా సినిమాని ప్రెజెంట్ చేస్తున్నాము. మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఏ క‌థ తీసుకున్నా ఎంట‌ర్‌టైన్‌మెంట్ మీదే ఫోకస్ పెడతాను. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ డోస్ హై రేంజ్ లో ఉంటుంది. కథతో పాటు క్యారెక్టర్లలోనూ కామెడీ ఉండటంతో సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు’’ అని చెప్పాడు.
Tags:    
  • Nani 
  • Lavanya Tripari 
  • Bhale Bhale Magadivoy Movie 
  • telugu NEws 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS