• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఫీషియల్: మహర్షి డేట్...

అఫీషియల్: మహర్షి డేట్ తీసుకున్న సీత

By - Tupaki Desk
Update: 2019-03-08 11:36 GMT
అంతా సవ్యంగా ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే మహర్షి ఏప్రిల్ 25న వచ్చేది. కాని సాంకేతిక కారణలు డేట్ సెంటిమెంట్ క్వాలిటీ అంటూ ఏవో కారణాలు చెప్పి దిల్ రాజు ఫైనల్ గా మే 9 లాక్ చేసిన సంగతి తెలిసిందే. సరే ఆ స్లాట్ ఖాళీ అయ్యింది కదా ఎవరు వస్తారా అని చూస్తుంటే బెల్లం హీరో కర్చీఫ్ వేసేశాడు. తేజ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సీతను ఏప్రిల్ 25 విడుదల చేయబోతున్నట్టు టీం అధికారికంగా ప్రకటించేసింది. గత కొంత కాలంగా నిర్మాణంలో ఉన్న సీత యూనిట్ కొద్దిరోజులుగా అప్ డేట్స్ ఇవ్వడం ఆపేసింది.

ఇప్పుడు ఏకంగా విడుదల తేదితో వచ్చేసి క్లారిటీ ఇచ్చింది. టైటిల్ లేడీ ఓరియెంటెడ్ గా ఉన్న కారణంగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించారు కాబోలు. అయితే సీత అనేది హీరొయిన్ పేరా లేక హీరో పేరులో సీత ఉందా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.  సాయి శ్రీనివాస్ కాజల్ రెండో సారి జట్టు కడుతున్నారు. గత ఏడాది ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన కవచం ఆశించిన ఫలితం అందుకోలేదు. అందుకే దీని మీదే హీరో గారి ఆశలన్నీ ఉన్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ వెంకటేష్ సినిమాలు చేజారాక తేజకు అందివచ్చిన అవకాశం ఇది.

కెరీర్ మొదలైనప్పటికి నుంచి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న సాయి శ్రీనివాస్ కి హిట్ ఇస్తే దర్శకుడిగా తన బ్రాండ్ ఇంకా పెరుగుతుందనే నమ్మకంతో ఉన్నాడు తేజ. ఇదో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టొరీగా ఇన్ సైడ్ టాక్ ఉంది. తేజ మార్క్ ప్రేమతో పాటు మాస్ ఆడియన్స్ కి కావలసిన అంశాలు ఇందులో పొందుపరిచినట్టు చెబుతున్నారు. నేనే రాజు నేనే మంత్రి తర్వాత వస్తున్న తేజ మూవీ కాబట్టి అంచనాలు బాగానే ఉన్నాయి. టీజర్ ట్రైలర్ ప్రీ రిలీజ్ వివరాలు ఇంకొద్ది రోజుల్లో వెల్లడిస్తారట
Tags:    
  • Bellamkonda Srinivas 
  • Kajal Agarwal 
  • Seetha movie Release Date 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS