• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిబి4 : మనసులో ఇంత...

బిబి4 : మనసులో ఇంత పెట్టుకుని బయటకు నవ్వుతున్నారా?

By - Tupaki Desk
Update: 2020-10-18 04:10 GMT
బిగ్ బాస్‌ నిన్నటి ఎపిసోడ్‌ సాదా సీదాగా సాగిపోయింది. ఇంటి సభ్యులు వారం అంతా చేసిన తప్పులను నాగార్జున మాట్లాడాల్సి ఉంటుంది. గత వారంలో ఎవరు ఎక్కవగా తప్పులు చేయక పోవడంతో ఎక్కువగా నాగార్జున క్లాస్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. అవినాష్‌ కు ఎంటర్‌ టైనర్‌ ఆఫ్‌ ది హౌస్‌ అంటూ బిరుదు ఇచ్చి సోహెల్‌ పై అతడు అరవడంపై సున్నితంగా మందలించాడు. సంచాలకుడి నిర్ణయంను ఎవరు కూడా తప్పుపట్టకూడదు అంటూ నాగార్జున అందరికి కూడా సూచించాడు. ఆ తర్వాత అరియానాను కూడా సోహెల్‌ ను పొగరు అంటూ తిట్టినందుకు ఆమెకు కూడా సున్నితంగా చురకలు అంటించాడు. సోహెల్‌ కు ఆమెతో సారీ చెప్పించాడు. ఇక అంతకు ముందు వారంలో సోహెల్‌ కోపంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వారం మొత్తం చాలా కూల్‌ గా ఉన్నాడు. ఆ విషయంలో సోహెల్‌ ను నాగార్జున అభినందించారు.

ఒకొక్కరిని మందలించడం పూర్తి అయిన తర్వాత ఒక్కో ఇంటి సభ్యుడి గురించి మరో ఇంటి సభ్యుడు ఏం అనుకుంటున్నాడు అనే విషయాన్ని నాగార్జున చెప్పగా అలా తమ గురించి ఎవరు అనుకున్నారు అనే విషయాన్ని ఊహించాల్సి ఉంటుంది. ఎవరైతే అలా అన్నారో వారి తలపై సుత్తితో ఒక్కటి కొట్టాల్సి ఉంటుంది. అవినాష్ నుండి ఇది మొదలు అయ్యింది. అవినాష్‌ ను క్రూరమైన మనస్థత్వం అంటూ ఒకరు రాశారు అది ఎవరు అంటూ నాగార్జున ప్రశ్నించాడు. ఆ సమయంలో మరో ఆలోచన లేకుండా అవినాష్‌ దివి వద్దకు వెళ్లి ఈమె రాసి ఉంటుందని అన్నాడు. అనుకున్నట్లుగానే దివి రాసింది. టాస్క్‌ సమయంలో తన విషయంలో ప్రవర్తించి తీరు కారణంగా అలా రాసినట్లుగా దివి వివరణ ఇచ్చింది.

మోహబూబ్‌ గురించి స్వార్థ పరుడు స్నేహంను వాడుకుంటున్నాడు అంటూ కుమార్‌ సాయి రాశాడు. లాస్య నవ్వు మోసపూరితంగా ఉంటుందని మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మాత్రం నవ్వుతుందని అమ్మ రాజశేఖర్‌ రాశాడు. అభికి అహంకారం కాస్త ఎక్కువ అంటూ దివి రాసింది. దానిని అఖిల్‌ లేదా మోనాల్‌ రాసి ఉంటారు అని అభి పొరపడ్డాడు. దివికి సభ్యత ఉండదని అవతలి వారి ఫీలింగ్స్‌ గురించి పట్టించుకోకుండా మాట్లాడుతుందని మోనాల్‌ రాసింది. అఖిల్‌ నిజాయితీ అనే ముసుగులో ఉంటాడు అంటూ అభిజిత్‌ రాశాడు. మోనాల్‌ అబద్దాల కోరు అంటూ కూడా అభిజిత్‌ రాశాడు. అమ్మ రాజశేఖర్‌ అందరిని ఏమార్చుతాడు అంటూ కూడా అభిజిత్‌ రాశాడు.

మొత్తానికి ఇంటి సభ్యులకు అవతలి వారిపై చాలానే ఉంది. కాని బయటకు మాత్రం వారితో నవ్వుతు ఉన్నారు. మాస్క్‌ లు మరింతగా తొలగి పోవడంతో ముందు ముందు మరెంతగా ఈ గేమ్‌ ఆసక్తికరంగా మారుతుందో చూడాలి. నిన్నటి ఎపిసోడ్‌లో లాస్య, హారిక, నోయల్‌ లు సేవ్‌ అయ్యారు. నేటి ఎపిసోడ్‌ లో కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అవ్వబోతున్నట్లుగా మీడియాసర్కిల్స్‌ లో వార్తలు వస్తున్నాయి. ఏం జరుగబోతుందో చూడాలి.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS