స్టార్ హీరో సీక్వెల్ సినిమా ఇక రాకపోవచ్చు!
టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా మూవీ.. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకు సూపర్బ్ రెస్సాన్స్ వచ్చింది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే చిత్రయూనిట్ ఆ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమాను తెరకెక్కిస్తామని ప్రకటించారు. తరువాత చాలా కాలం పాటు బంగార్రాజు సినిమా పనిలోనే ఉన్న కళ్యాణ్ కృష్ణ తరువాత కథ సెట్ కాకపోవటంతో నాగ చైతన్య తో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దీంతో నాగ్ - కళ్యాణ్ కు మరో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుని కథ సిద్ధమైతే బంగార్రాజు పాత్రకు రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చాడు.
కళ్యాణ్ కృష్ణ కూడా చాలా కాలంగా ఈ సినిమా కథ మీదే కసరత్తులు చేస్తున్నాడు. ఇటీవల అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో కళ్యాణ్ కృష్ణ సోదరుడి మరణంతో సినిమా మరింత వెనక్కి వెళ్లింది. తాజాగా మరోసారి బంగార్రాజు సినిమా వార్తలు తెర మీదకు వచ్చాయి. త్వరలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. కథా కథనాలు సిద్ధం కావటంతో మార్చిలో సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్న నాగార్జున ఆ సినిమా పూర్తయిన వెంటనే బంగార్రాజు సినిమాకు డేట్స్ ఇస్తాడని టాక్ వినిపించింది. కానీ అనూహ్యంగా నాగార్జున.. గరుడవేగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకి అవకాశం ఇచ్చి కళ్యాణ్ కృష్ణకి షాక్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం బంగార్రాజు ప్రాజెక్ట్ పక్కన పెట్టినట్లే అని సమాచారం. కళ్యాణ్ కృష్ణ తీసిన ‘నేల టికెట్ట్’ డిజాస్టర్ అవడంతో నాగ్ ‘బంగార్రాజు’ సినిమా చేయడానికి భయపడుతున్నాడట. నాగ్ ఏది క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆగాలా.. వద్దా.. అనే సందిగ్ధం లో కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. పరిస్థితులు చూస్తుంటే బంగార్రాజు ఇక తెరమీదకి రాకపోవచ్చు అంటున్నాయి సినీ వర్గాలు.