న‌మ్ర‌త ఎంద‌రికో స్ఫూర్తినిచ్చిన మ‌హిళ!- బండ్ల గ‌ణేష్‌

Update: 2020-09-23 07:10 GMT
బాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ప‌లువురు అగ్ర క‌థానాయిక‌ల పేర్లను జాతీయ మీడియాలు హైలైట్ చేయ‌డంతో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ఈ గొడ‌వ‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరును జాతీయ మీడియా హైలైట్ చేయ‌డంతో కోర్టును ఆశ్ర‌యించారు. ఇంకా నిజానిజాలేవీ నిగ్గు తేల‌కుండానే త‌న పేరును వైర‌ల్ చేయ‌డంపై `ప‌రువు తీస్తున్నారు` అంటూ ర‌కుల్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ కోర్టులో పిటిష‌న్ వేశారు. త‌న‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని.. దీనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ర‌కుల్ టీమ్ నివేదించింది.

ఈ మంగ‌ళ‌వారం సాయంత్రం క్వాన్ మేనేజ‌ర్ డ్ర‌గ్స్ చాట్ లో `ఎన్` అనే అక్ష‌రం అంటూ న‌మ్ర‌త పేరును ప్ర‌ముఖంగా ప్ర‌చారంలోకి తెచ్చాయి జాతీయ మీడియాలు. అయితే ఇది అస‌త్య ప్ర‌చార‌మ‌ని.. కావాల‌నే త‌మ‌పై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని న‌మ్ర‌త టీమ్ ఖండించింది. ఈ ప్ర‌చారంపై మ‌హేష్ అభిమానులే కాకుండా ప‌లువురు సెల‌బ్రిటీలు సోషల్ మీడియాలో ఈ అనాధారిత ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

ఈ కేసులో జాతీయ మీడియా అతి అని చీవాట్లు పెట్టిన నెటిజ‌నులు ఉన్నారు. ఇంకా విచార‌ణ‌లో నిజాలేవీ తేల‌క ముందే ఇలా ప్ర‌ముఖుల పేర్లు ప్ర‌చారం చేయ‌డం స‌రికాద‌న్న వాద‌నను ఒక సెక్ష‌న్ బ‌ల‌ప‌రిచింది. లేటెస్టుగా ప్రముఖ నిర్మాత.. నటుడు బండ్ల గణేష్ స్పందిస్తూ.. ``నమ్రత శిరోద్క‌ర్ నాకు 15 ఏళ్లుగా తెలుసు. ఆమె ఎంతోమంది మహిళలకు స్పూర్తి నింపిన గొప్ప వ్య‌క్తిత్వం. ఆమె ఒక గొప్ప భార్య.. గొప్ప తల్లి.. ఆమెను నేను గౌరవిస్తాను`` అంటూ ట్వీట్ చేశారు.
Tags:    

Similar News