ఐదు సినిమాలతో రెడీ అవుతున్న బండ్ల
ఒక దశలో విరామం లేకుండా సినిమాలు తీస్తూ దూసుకెళ్లిన బండ్ల గణేష్ ఈ మధ్య స్లో అయ్యాడు. దాదాపు రెండేళ్లుగా అతడి నుంచి సినిమానే రాలేదు. ‘టెంపర్’ హిట్టు తర్వాత కూడా అతను ఇంత గ్యాప్ తీసుకోవడం ఆశ్చర్యమే. ఐతే తాను నెమ్మదించాను తప్ప సినిమాలు మానేయలేదని అంటున్నాడు బండ్ల. ఒకేసారి ఐదు సినిమాలకు తాను సన్నాహాలు చేస్తున్నట్లుగా బండ్ల వెల్లడించాడు.
‘‘ప్రస్తుతం స్ట్రాంగ్ బేస్మెంట్ వేస్తున్నా. దాని మీద పెద్ద బిల్డింగ్ కట్టబోతున్నా. మంచి సినిమాలు తీయాలనే విరామం తీసుకున్నా. చిన్న సినిమాలే తీయాలనుకుంటే ఈ గ్యాప్ లో పది తీసేవాడిని. కానీ పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేయడానికే ఇలా టైం తీసుకున్నా. ఐదు సినిమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ కాంబినేషన్లు ఏంటనేది త్వరలోనే వెల్లడిస్తా. నేను ఎప్పుడు తీసినా పెద్ద సినిమాలే తీస్తా’’ అని బండ్ల గణేష్ అన్నాడు.
ఇంతకీ సినిమాలు తీయడానికి అంతంత పెద్ద పెట్టుబడులు ఎలా పెట్టగలుగుతున్నారని బండ్లను అడిగితే.. ‘‘సినిమాలు తీయడానికి డబ్బులే అవసరం లేదు. పెద్ద హీరోల డేట్లే సినిమాకు పెట్టుబడి. అవి ఉంటే ఆటోమేటిగ్గా డబ్బులు సమకూరుతాయి. నాకు హీరోలతో మంచి సంబంధాలున్నాయి. కాబట్టి డేట్లు సంపాదించగలను. ఆటోమేటిగ్గా అన్నీ రెడీ అయిపోతాయి’’ అని బండ్ల చెప్పాడు. తనపై ఇప్పటిదాకా మూడుసార్లు ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేశారని.. రూ.10 కోట్ల దాకా ట్యాక్స్ కట్టానని బండ్ల వెల్లడించడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/