స్టార్ హీరోలు.. బండ్లకు దూరమేనట

Update: 2015-11-16 07:30 GMT
బండ్లు ఓడలవుతాయి - ఓడలు బండ్లవుతాయి అని ఓ సామెత ఉంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేశాక అతి తక్కువ టైంలోనే పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ - అల్లు అర్జున్ లతో సినిమాలు తీసేసి సంచలనాలు సృష్టించేశాడు. గబ్బర్ సింగ్ మినహాయిస్తే.. మిగతా మూవీస్ ఏవీ హెల్ప్ అవలేదు సరికదా నష్టాలు తెచ్చిపెట్టాయి.

గోవిందుడుని రిలీజ్ చేసేందుకయితే చరణ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది కూడా. చెర్రీ అండతో ఎలాగోలా రిలీజ్ అయితే చేశాడు కానీ... మూవీ యావరేజ్ గా మిగలడంతో.. అంతగా దక్కిందేమీ లేదు. ఇప్పుడు సినిమాలు చేతిలో లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడట బండ్ల. వీటినుంచి బయటకు వచ్చేందుకు చకచకా స్టార్లతో మూవీస్ తీసేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే.. బండ్ల బ్యానర్ సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. కిందా మీదా అవుతున్నాడీ ప్రొడ్యూసర్. మహేష్ బాబు నుంచి అప్పుడెప్పుడో మాట తీసుకున్నా అంటాడు కానీ.. సూపర్ స్టార్ ఇప్పటి కమిట్ మెంట్స్ కంప్లీట్ అవడానికే మూడేళ్లకు పైగా పడుతుంది. బ్రూస్ లీ తర్వాత చరణ్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

మరోవైపు ఎన్టీఆర్ కి బండ్లకు అంతగా సఖ్యత లేదిప్పుడు. పవర్ స్టార్ తో కూడా అదే ప్రాబ్లెం. కనీసం నితిన్ అయినా సినిమా చేసేసి.. ఒడ్డున పడదామని ప్రయత్నిస్తుంటే.. ఆ కుర్రహీరో తనే నిర్మాతగా మారిపోయి మూవీస్ చేసేసుకుంటున్నాడు. ఇక ఆఖరిగా అఖిల్ కోసం ట్రై చేస్తున్నా.. గ్రీన్ సిగ్నల్ మాత్రం రావడం లేదు. అగ్రహీరోలందరూ బండ్ల గణేష్ కి మొహం చాటేస్తుండడంతో.. ఈ భారీ చిత్రాల నిర్మాతకు ఇబ్బందులు పెరుగుతున్నాయి
Tags:    

Similar News