పవన్ ఆ నిర్మాతను ఒరేయ్ అంటాడట
పవన్ కళ్యాణ్ తనను ఒరేయ్ అని పిలుస్తాడంటూ చాలా గర్వంగా చెప్పుకున్నాడు బండ్ల గణేష్. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నది తన కోరిక అని.. కచ్చితంగా ఆ పదవి చేపట్టి తీరుతాడని.. అదే జరిగితే అది తెలుగు ప్రజల అదృష్టమని బండ్ల వ్యాఖ్యానించాడు. పవన్ తో తన అనుబంధం గురించి.. ఆయనతో విభేదాల గురించి.. ఆయన రాజకీయ ప్రయాణం గురించి బండ్ల ఇంకా ఏమన్నాడంటే..
‘‘జనసేన అని పెట్టాడు మా బాస్. ఆయనతో ఉండాలి నేను. కానీ ఓ పదేళ్ల పాటు సినిమాలు తీయాలని ఉంది. ఊరికొక్క పవన్ కళ్యాణ్ ఉంటే ఈ దేశం గొప్ప స్థాయికి వెళ్తుందనే ఒకప్పటి నా మాటకు 200 పర్సంట్ కట్టుబడి ఉన్నా. ఆయన ప్రతి మాటా నిజాయతీనే. ఆయనొక రోజు ముఖ్యమంత్రి అవుతాడు. పవన్ నిజాయితీకి దేవుడిచ్చే వరం అది. ఆయన సీఎం అయితే అది తెలుగు ప్రజల అదృష్టం. ఆయన సీఎం అవుతారు కూడా. పవన్ కు ఆవేశం ఎక్కువ అంటారు. ఆవేశపరుడైతే నష్టమా? ఆవేశంగా మంచి నిర్ణయాలు తీసుకోకూడదా? ఆవేశపరుడు అంటే దుర్మార్గుడా? నా దృష్టిలో ఆవేశం లేని వాడు పైకి రాడు. ఆలోచనలో ఉన్నవాడు పని చేయడు. ఆలోచిస్తూనే కూర్చుంటాడు.
పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన వ్యక్తి. ఫలానోడు వస్తున్నాడు ఇలా చెయ్యి వెయ్యాలి. అలా షేక్ హ్యాండివ్వాలి. అలా మాట్లాడాలి అనేదీమీ ఆయన దగ్గర ఉండదు. నచ్చితే ఓకే. నచ్చకపోతే వెళ్లిపోండయ్యా అని చెప్పేస్తాడు. ఆయన కోపాన్ని నేను చూశాను. చెప్పిన పని చేయలేదని నన్ను చెడామడా తిట్టేవాడు. ఎవరూ లేనపుడు నన్ను ఒరేయ్ అంటాడు. అందరి ముందు గణేష్ అంటాడు. ఆయనకు సంస్కారం ఎక్కువ. అది రేర్ పీస్. దేవుడు అలాంటి రేర్ పీస్ లను తయారు చేస్తాడు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్లీ ఆయనతో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ కుదర్లేదు. ఎందుకోగానీ రెండేళ్లు ఆయన్ని కలవలేదు. గ్యాప్ వచ్చింది. అప్పుడు నా పొగరనుకోండి. ఇంకోటనుకోండి. నేను అనే ఫీలింగ్ వచ్చి రెండేళ్లు దూరంగా ఉన్నా. గణేష్ అనే వాడు ఆయన దూరంగా ఉంటే ఎలా ఉంటుందో చూశా. కానీ ఆయన లేకుండా బతకలేనని అర్థమైంది. నేను అనేది పోయి.. మనం అనేది మొదలైంది. ఐతే పవన్ గారితో గ్యాప్ వచ్చినా.. మానసికంగా రాలేదు’’ అని బండ్ల గణేష్ చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/