• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గల్ఫ్ దేశాల్లో మోహన్‌లాల్...

గల్ఫ్ దేశాల్లో మోహన్‌లాల్ సినిమాపై నిషేధం?

By - Tupaki Desk
Update: 2022-10-19 05:17 GMT
గల్ఫ్ దేశాలు.. ఈ పేరు చెబితేనే కఠిన చట్టాలకు పేరు. ఇక్కడ అనైతికంగా ఏం చేసినా కఠిన జైలు శిక్షలు ఉంటాయి. ఇటీవల వాట్సాప్ లో ఏదో చాట్ చేసిన భారతీయులకు కఠిన జైలు శిక్షలు విధించింది ఇక్కడి ప్రభుత్వం. నిబంధనలు తెలుసుకోకుండా అక్కడ ఏది పడితే అది చేస్తాం అంటే కుదరదు. తాజాగా గల్ఫ్ దేశాల్లో ఓ మలయాళీ సినిమాపై నిషేధం విధించడం హాట్ టాపిక్ గా మారింది.

2016లో వచ్చిన 'పులిమురుగన్' సినిమాతో మలయాళంలో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు సీనియర్ హీరో మోహన్ లాల్ మరియు దర్శకుడు వైశాఖ్. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి తీసిన కొత్త చిత్రం 'మాన్‌స్టర్‌' ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మంచు లక్ష్మి కూడా కీలక పాత్రలో కనిపించనుంది.

విడుదలకు కొద్ది రోజుల ముందు, మాన్ స్టర్ సినిమా సమస్యల్లో పడింది. తాజా వివాదం ఏంటంటే.. ఈ చిత్రం గల్ఫ్ దేశాలైన యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ మరియు కువైట్‌లలో విడుదల కాకపోవచ్చు. అక్కడ నిషేధం విధించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.  ఈ దేశాల్లో మలయాళీలు అధికంగా ఉంటారు. వారు ఇక్కడ మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తారు. గల్ఫ్ దేశాల్లో మలయాళ చిత్ర పరిశ్రమకు పెద్ద మార్కెట్‌ ఉంది.

గల్ఫ్ దేశాలు ఈ చిత్రాన్ని నిషేధించడానికి ప్రధాన కారణం ఇందులో లెస్బియన్, గే, బై సెక్సువల్స్, ట్రాన్స్ జెండర్   కంటెంట్‌ని కలిగి ఉండడమే. ఇవన్నీ గల్ఫ్ దేశాల్లో నిషేధం. ఇలాంటివాటిపై ఉక్కుపాదం మోపుతారు. ఈ మాన్ స్టర్ చిత్రంలో కొన్ని దృశ్యాల కారణంగా గల్ఫ్ దేశాలలో ఈ చిత్రం నిషేధించబడింది. ఇది టీమ్‌తో పాటు మోహన్‌లాల్ అభిమానులకు షాక్ ఇచ్చింది.

గల్ఫ్ దేశాల్లో రీ సెన్సార్ కోసం టీమ్ దరఖాస్తు చేసుకున్నట్లు వినికిడి. దీనికి ఆమోదం లభించినా, ఈ వారం ఖచ్చితంగా విడుదల కాకపోవచ్చు అని సన్నిహితులు తెలిపారు.

ముందస్తు బుకింగ్‌లు కూడా రద్దు చేయబడ్డాయి. జిసిసి దేశాల్లో విడుదలకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • GulfCountries 
  • HeroMohanlal 
  • PulimuruganFilm 
  • MalyalamFilmIndustry 
  • DirectorVaisakh 
  • MonsterFilm 
  • BanonMohanlalFilmsinGulfCountries 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS