ఆదర్శవంతమైన బాలయ్య సంస్కారం ఇది!

Update: 2016-10-20 09:19 GMT
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి వారికున్న స్థానం ప్రత్యేకం. పెద్దాయన నటవారసుడిగా వెండితెరపైకి దూసుకొచ్చిన బాలకృష్ణ.. తండ్రి నటననే కాదు సంస్కరాన్నీ వారసత్వంగా తీసుకున్నారనే సంగతి తెలిసిందే. తెలుగు తెరపై బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సినిమాలో ప్రత్యర్ధులపై ఏస్థాయిలో మాటలతోనూ చేతలతోనూ విరుచుకుపడతారో, తెర బయట అంత సౌమ్యంగా కనిపిస్తారు బాలయ్య. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ సంస్కారానికి మరో ఉదాహరణగా తాజాగా వెలుగులోకి వచ్చింది ఒక ఫోటో. ఈ ఫోటో ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.

బిగ్ బీ అమితాబ్ ప్రస్తుతం తన తాజా చిత్రం "సర్కార్ - 3" షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబై ఫిలిం సిటీలో ఈ బాలీవుడ్ మెగాస్టార్ ప్రధాన పాత్ర పోషిస్తున్న రామ్‌ గోపాల్ వర్మ చిత్రం "సర్కార్-3" షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ సమయంలో నందమూరి బాలకృష్ణ "సర్కార్ - 3" సెట్లో సందడి చేశారు. అక్కడికి వెళ్లి అందరినీ తనదైన ఆప్యాయతతో పలకరించిన బాలయ్య.. అమితాబ్‌ బచ్చన్‌ కు మాత్రం వినమ్రంగా ఒంగి పాదాభివందనం చేశారు. లెజెండరీ నందమూరి తారకరామారావు కుమారుడు - ఎమ్మెల్యే - స్టార్ హీరో అయిన బాలకృష్ణ ఇలా తనకు పాదాభివందనం చేయడం పట్ల అమితాబ్ ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం బాలయ్యతో సరదాగా ముచ్చటించారు.

అయితే ఇది కేవలం మర్యాదపూర్వకంగా - అమితాబ్ పై తనకున్న అభిమానం కొద్దీ బాలయ్య కలిశారనే చెబుతుండగా... ఈ కలయికపై కూడా చిన్న చిన్న గాసిప్స్ వచ్చేస్తున్నాయి. బాలకృష్ణ 100వ సినిమా గౌతమి పుత్రశాతకర్ణి తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో రైతు సినిమా చేయబోతున్న బాలయ్య... ఆ సినిమా కోసం అమితాబ్ ను ఒక పాత్ర చేయమని ఒప్పించడానికి వెళ్లారని గాసిప్స్ వస్తున్నాయి. అయితే వీటిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News