• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య పిలుస్తాడట.....

బాలయ్య పిలుస్తాడట.. కేసీఆర్ వస్తాడా?

By - Tupaki Desk
Update: 2018-12-13 07:34 GMT
తెలంగాణ ఎన్నికల్లో నారా-నందమూరి కుటుంబాలకు ఘోర పరాభవమే ఎదురైంది. ఇటు చంద్రబాబు నాయుడు.. అటు బాలకృష్ణ వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా ప్రయోజనం లేకపోయింది. తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ముఖ్యంగా బాలయ్య ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో పరిస్థితి తెలిసిందే. కనీసం నందమూరి సుహాసినిని కూడా గెలిపించుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీకి మంచి బలం ఉన్న నియోజకవర్గంలో ఆమెకు అలాంటి పరాభవాన్ని ఎవ్వరూ ఊహించలేకపోయారు. మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు టీడీపీ స్థైర్యాన్ని బాగానే దెబ్బ తీశాయి. ఈ ప్రభావం ‘యన్.టి.ఆర్’ సినిమా ఆడియో వేడుక మీద కూడా పడినట్లు సమాచారం. ఈ నెల 16న తిరుపతిలో ఆడియో వేడుక చేయాలనుకున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కూడా ఆడియో వేడుకకు పిలవాలనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రణాళికలు మారినట్లు సమాచారం. ఓటమి భారంలో ఉన్న చంద్రబాబు.. బాలయ్య ఇప్పుడే ఈ వేడుక చేయాలనుకోవట్లేదట. ఇప్పుడీ ఫంక్షన్ చేయడం మంచి సంకేతాల్ని కూడా ఇవ్వదని 21వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. ఆ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఆహ్వానించాలని బాలయ్య భావిస్తున్నట్లు సమాచారం. ఐతే మొన్నటి ఎన్నికల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని బద్ధ శత్రువుల్లా వ్యవహరించాక కేసీఆర్ వచ్చి చంద్రబాబుతో కలిసి వేదిక పంచుకోవడానికి ఇష్టపడతాడా అన్నది సందేహం. కచ్చితంగా ఆయన ఈ వేడుకకు వచ్చే అవకాశాల్లేవు. పైగా ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసి.. వెంటనే తిరుపతికి వచ్చి ఈ వేడుకలో పాల్గొనడం కూడా ఇబ్బందే. కాబట్టి కేసీఆర్ వచ్చే అవకాశమే లేదు. ఐతే బాలయ్య వెళ్లి కేసీఆర్‌ ను ఆహ్వానిస్తే మాత్రం ఆ పరిణామం ఆసక్తి రేకెత్తించేదే.
Tags:    
  • Balakrishna 
  • KCR 
  • NTR Biopic Audio Launch 
  • Tirupati 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS