అబ్బాయ్ కోసం బాబాయ్ వస్తాడా?

Update: 2018-03-19 12:39 GMT
నందమూరి కళ్యాణ్ రామ్ ఎమెల్యే మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి అడుగు పెట్టనుంది.  చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాస్త ఆలస్యంగా చేస్తున్నారు.రేపు హైదరాబాద్ దసపల్లాలో జరగనున్న వేడుకకు గెస్ట్ గా ఎవరు వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మామూలు పరిస్థితుల్లో అయితే అన్నయ్య సినిమా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా వచ్చేవాడు. కాని త్రివిక్రమ్ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు కనక ఒకవేళ హాజరయితే కెమెరా కళ్ళు మొత్తం తన చుట్టే ఉంటాయి. పైగా ఆ షూటింగ్ ప్రారంభానికి ముందే లుక్ రివీల్ చేసినట్టు అవుతుంది. అందుకే తారక్ రాడు అనే దాంట్లో డౌట్ అక్కర్లేదు. ఇక నాన్న హరికృష్ణ అందుబాటులోనే ఉన్నారు కనక ఆయన హాజరు తప్పనిసరి.

కాని నందమూరి ఫాన్స్ మాత్రం బాలయ్య రావాలని కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఈవెంట్ జరిగేది రేపే కాబట్టి ఒకవేళ పిలవాలి అనుకుంటే ఈపాటికే ఆహ్వానం అందించి ఉండాలి. మరి పిలిచాడో లేదో ఒక్క కళ్యాణ్ రామ్ బాలయ్యలకు మాత్రమే తెలుసు. వస్తే కలర్ఫుల్ గానే ఉంటుంది కాని చాలా కాలం నుంచే కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్ ఫంక్షన్లకు బాలయ్య వెళ్ళిన దాఖలాలు లేవు. పైగా పొలిటికల్ టచ్ ఉన్న ఎమెల్యే సినిమా ఫంక్షన్ అంటే కొంత ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయంగా ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులు గరం గరంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో సినిమా వేడుకలకు వెళ్ళడం అవసరమా అనే ఆలోచన చేసినా ఆశ్చర్యం లేదు.

మరి బాలయ్య కూడా మిస్ అయితే ఇంకెవరు వస్తారా అనే సస్పెన్స్ లో ఉన్నారు నందమూరి ఫాన్స్. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కాజల్ మొదటిసారి కళ్యాణ్ రామ్ తో ఆడిపాడుతోంది. మణిశర్మ మ్యూజిక్ ఆల్బం ఇప్పటికే బాగానే పేరు తెచ్చుకుంది. మరి పటాస్ తర్వాత హిట్ లేక ఆకలి మీదున్న కళ్యాణ్ రామ్ విజయ కాంక్షను ఎమెల్యే తీరుస్తుందో లేదో మరో నాలుగు రోజుల్లో తేలిపోతుంది
Tags:    

Similar News