బాలయ్య - బోయపాటి సినిమాలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయా...?
నటరత్న నందమూరి బాలకృష్ణ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోస్ట్ పవర్ ఫుల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారని సమాచారం. బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ' 'లెజెండ్' సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపించనున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని వార్తలు వస్తున్నాయి.
అయితే బోయపాటి సినిమా అంటేనే పాలిటిక్స్.. జనాల్ని ఉద్దరించే హీరో అనే వాటి మీద బేస్ అయి ఉంటాయి. మళ్లీ ఇదే రోల్ మీదనే తన సినిమాను ప్లాన్ చేసుకున్నాడట బోయపాటి. బాలకృష్టతో ఇప్పటి వరకు చేసిన సినిమాలని గమనించినట్లయితే బాలయ్య రోల్స్ దాదాపు ఇదే స్టైల్ లో బోయపాటి డిజైన్ చేసాడని స్పష్టమవుతుంది. మరోసారి అదే సక్సెస్ ఫార్ములాని ట్రై చేస్తున్నాడని సమాచారం. అయితే దాని నుంచి కొంచెం బయటకు రావడానికి బాలయ్యతో ఈసారి అగోరా గెటెప్ కూడా వేయించాడు బోయపాటి. మరి ఈ ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇది పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయాల్లో కొంత మేర కట్టింగ్స్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. కరోనా ఎఫెక్ట్ వల్ల అన్ని సినిమాల బడ్జెట్ లలో చాలా వరకు మార్పులు చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఏ సినిమా విషయంలో కూడా అదే జరిగిందట.
అంతేకాకుండా ఈ సినిమాలో కొంతమేర ఫారిన్ లొకేషన్స్ లో ప్లాన్ చేశారట చిత్ర యూనిట్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫారిన్ కాదు కదా స్టేట్ గేట్ దాటే సిచ్యుయేషన్ కూడా లేదు. దీంతో పూర్తి ఫారిన్ ఎపిసోడ్స్.. అక్కడ జరిపే సన్నివేశాల్ని విశాఖకు షిప్ట్ చేసి ఇక్కడ లోకల్ బ్రాక్ డ్రాప్ లో కథ రెడీ చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయంలో నిర్మాతలు బోయపాటి పై ప్రెజర్ పెడుతున్నారని సమాచారం. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ బ్లాక్ బస్టర్ అందించిన బోయపాటి శ్రీను ఇప్పుడు మళ్ళీ ప్లాపుల్లో ఉన్న బాలయ్యని గట్టెక్కిస్తాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మరి ఈ చిత్రంతో బాలయ్య - బోయపాటి శ్రీను హాట్రిక్ హిట్ సాధించి బాలయ్య మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.