• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఎన్టీఆర్ కు వెన్నుపోటు'...

'ఎన్టీఆర్ కు వెన్నుపోటు' పై బాలయ్య కన్నీళ్లతో స్పందన

By - Tupaki Desk
Update: 2021-12-06 13:00 GMT
'అన్ స్టాపబుల్'.. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షో మొదలైనప్పటి నుంచి పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది. మొట్టమొదట మోహన్ బాబు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసిన బాలయ్య తర్వాత నాని, ఇటీవలే మహేష్ బాబుతోనూ ముచ్చటించారు. ఇక తాజాగా తనకు హిట్ అందించిన 'అఖండ' మూవీ టీంతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ షో ద్వారా బాలయ్యలోని కొత్త కోణాన్ని జనాలకు పరిచయం చేస్తున్నారు. బాలయ్య హుషారుగా ఇంత సరదాగా.. ఏ తడబాటు లేకుండా షోను నడిపిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇక షోలో కొన్ని వివాదాస్పద విషయాల మీద బాలయ్య ఓపెన్ అయిపోతుండడం.. తనదైన శైలిలో స్పందిస్తుండడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

రాజకీయాలతో ముడిపడ్డ సంచలన విషయాలు బాలకృష్ణ బయటపెడుతున్నాడు. షో తొలి ఎపిసోడ్ లో మోహన్ బాబు తాగే మద్యం గురించి అడిగి షాకిచ్చిన బాలయ్య.. ఆ తర్వాత మోహన్ బాబు అడిగిన 'టీడీపీ పగ్గాలు ఎందుకు చేపట్టలేదు' అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాడు. వారసత్వ రాజకీయాలకు తాను దూరం అని చెప్పడానికే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు.

తాజాగా మరో సున్నిత వివాదాస్పద విషయం గురించి బాలయ్య ఓపెన్ అయిపోయాడు. ఈ షోలో 'అఖండ' టీం సభ్యులైన బోయపాటి శీను, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ తో బాలయ్య కొత్త ఎపిసోడ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో చాలా వరకు సరదాగా సాగిపోయింది కానీ.. చివర్లో భారీ ట్విస్ట్ నెలకొంది.

చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడనే ఆరోపణల గురించి బాలయ్య స్పందించాడు. అందరూ వెన్నుపోటు అంటుంటారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని..కానీ అబద్దమని బాలయ్య వివరణ ఇచ్చాడు.

వెన్నుపోటు అంటుంటే తనకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయంటూ బాలయ్య ఎమోషనల్ అవ్వడం గమనార్హం.  తాను ఎన్టీఆర్ కొడుకుల్లో ఒకడినే కాదని.. ఆయన అభిమానన్నారు. ఈ ప్రోమో అంతే కట్ చేయడంతో బాలయ్య 'వెన్నుపోటు' గురించి ఏం చెప్పాడన్నది ఆసక్తి రేపుతోంది. ఫుల్ ఎపిసోడ్ కోసం అందరూ వెయిల్ చేయాల్సిందే..
Tags:    
  • Unstoppable With NBK 
  • AHA 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS