బాల‌య్యకు 100/100 వేశాడు!

Update: 2018-12-30 05:03 GMT
య‌న్టీఆర్ బ‌యోపిక్ లో టైటిల్ పాత్ర పోషిస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ ఆ పాత్ర‌కు సూట‌బులేనా? అచ్చం అన్న‌గారు ఎన్టీఆర్ లా న‌టించారా?  న‌టించ‌గ‌లిగారా?  పెద్దాయ‌న రేంజు అభిన‌యం, ఆహార్యం చూపించ‌గ‌లిగారా? ఆన్ లొకేష‌న్ వీక్షిస్తే మీకేమ‌నిపించింది?  ఆ స్థాయి క‌నిపించిందా? .. ఇదే ప్ర‌శ్న రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్‌ నే ప్ర‌శ్నిస్తే ఆయన ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

``ఈ సినిమాలో బాలకృష్ణ నటన చూస్తుంటే వంద‌శాతం రామారావుగారిని చూస్తున్నట్లే అనిపించింది. సెట్ లో బాలకృష్ణగారి నటన చూసి నేను చాలాసార్లు ఆశ్చర్యపోయాను. కొన్నిసార్లు రామారావు గారేమోనని భ్రమపడి కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి`` అని ఎమోష‌న్ అయ్యారు. సాయిమాధ‌వ్ చెప్పిన దానిని బ‌ట్టి ఈ సినిమా కోసం బాల‌య్య ప్రాణం పెట్టి ప‌ని చేశార‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌తిభావంతుడైన క్రిష్ త‌న‌ని అన్న‌గారిలా చూపించేందుకు ఎంతో ప‌క‌డ్భందీగా ప‌ని చేశార‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ద‌ర్శ‌కుల హీరోగా బాల‌య్య క్రిష్ కి ఇచ్చే గౌర‌వం దృష్ట్యా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఆన్ లొకేష‌న్ సింక్ అంతే బాగా కుదిరింద‌ని అర్థ‌మవుతోంది. లొకేష‌న్ లో ర‌చ‌యిత‌ల‌తోనూ బాల‌య్య ఎంతో క‌లివిడిగా ఉంటార‌ట‌. ర‌చ‌యిత‌ల్ని ఆయ‌న గౌర‌వించిన‌ట్టు వేరొక‌రు గౌర‌వించ‌ర‌ని చెబుతుంటారు.

బాల‌య్యకు 100/100 మార్కులు వేయ‌డ‌మే కాదు, ఆయ‌న డైలాగుల‌కు అంతే గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కుతాయ‌ని బుర్రా తెలిపారు. ``సమయం లేదు మిత్రమా... అని గౌత‌మిపుత్రుడు చెప్పిన‌  డైలాగ్‌ రాసేటప్పుడు అది సిగ్నేచర్‌ డైలాగ్‌ అవుతుందనుకోలేదు. కానీ అయ్యింది. అలాగే ఇందులో ఆయన బయోపిక్ కి డైలాగ్ లు రాస్తున్నాను. ఫీల్ తో రాస్తాం. క్లాప్స్ ప‌డితే సిగ్నేచ‌ర్ ప‌డిన‌ట్టే. ఆన్ లొకేష‌న్ సీన్ తీసేప్పుడు రోజూ ఓసారైనా క్లాప్స్ ప‌డేవి. థియేట‌ర్ల‌లోనూ జ‌నాల నుంచి అంతే స్పంద‌న వ‌స్తుంద‌ని అనుకుంటున్నా`` అని అన్నారు. ఇందులో సి.ఎస్‌.ఆర్‌, రేలంగి వంటి దిగ్గ‌జాల తో పాటు, చంద్రబాబునాయుడు, వైయ‌స్పార్ లాంటి రాజకీయ నాయకులకు మాటలు రాసే అదృష్టం దక్కింద‌ని సాయిమాధ‌వ్ తెలిపారు.
Tags:    

Similar News