బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ పై బ్యాడ్ రూమర్స్..!
సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి పుకార్లు కూడా పెనువివాదాలకు దారి తీస్తుంటాయి. మరికొన్ని పుకార్లు సెలబ్రిటీలను ఎంతగానో బాధిస్తాయి. ఈ రెండిట్లోను కామన్ పాయింట్ రూమర్స్. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ శ్వాస సంబంధ సమస్యలతో ఇటీవల ముంబై ఖార్ హిందూజ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వయసు 98సంవత్సరాలు. వయసు మీదపడటంతో కొన్నేళ్లుగా దిలీప్ కుమార్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారట. అందుకే ప్రతినెలా ఆసుపత్రికి వెళ్తూ ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటున్నారు. ఈ ఆదివారం ఆయనకు శ్వాస విషయంలో అవస్థగా అవడంతో వెంటనే ఆయన ఫ్యామిలీ ఆసుపత్రిలో చేర్చారు. తాజాగా ఆయన భార్య సైరా భాను స్పందించి అసలు విషయం తెలిపారు.
అయితే నిజానికి దిలీప్ కుమార్ ఆసుపత్రిలో చేరిన సమయం నుండి సోషల్ మీడియాలో ఆయన మరణించారు అంటూ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. వాట్సాప్ లలో కూడా ఆయన వార్తలు షేర్ చేస్తున్నారట. ఈ రూమర్స్ పై సైరా భాను గారు ట్విట్టర్ వేదికగా స్పందించి.. "వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లను నమ్మకండి. ప్రస్తుతం సాబ్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం పట్ల మీ నమ్మకం అభిమానం దైవప్రార్థనలకు ధన్యవాదాలు. ఆయనను 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపినట్లు ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం నటుడు దిలీప్ కుమార్.. ప్రముఖ కార్డియాలజిస్ట్ నితిన్ గొఖలే, పల్మనాలజిస్ట్ డాక్టర్ జలిల్ పార్‌కర్ పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. దిలీప్ కుమార్ మొదటిసారి 1944లో జ్వార్ భాతా సినిమాతో నటన ప్రారంభించారు. దిలీప్ కుమార్ అసలు పేరు.. మహమ్మద్ యూసుఫ్ ఖాన్. అలా ఎన్నో ఏళ్లు దిలీప్ కుమార్ ఇండస్ట్రీలో నటుడుగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం గురించి ఎవరు టెన్షన్ పడవద్దని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.